Tech Layoffs: టెక్ ఉద్యోగులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని దినదినగండంగా రోజులు గడిపేస్తున్నారు. ఆర్థికమాంద్యం ప్రభావంతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు వేలాది మందిని ఇప్పటికే ఉద్యోగాలనుంచి తొలగించాయి. ఒక్క ఏడాదిలో రోజుకు 3 వేల మందికిపైగా టెక్ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం, డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ మరోసారి ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. కొన్ని నెలల క్రితమే వేలాది మందిని పీకేసిన సంస్థ.. మరోసారి 6,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత చేపట్టినట్లు తెలిపింది.
Read Also: KTR: పరిశ్రమలకు భూములిచ్చిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనదే
ప్రపంచవ్యాప్తంగా 5 శాతం ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది. గతేడాది రెస్పిరేటరీ డివైజ్‌లను భారీగా రీకాల్ చేసింది. ఆ ప్రభావం సంస్థపై తీవ్రంగా ఉంది. ఇంకా కొనసాగుతుండటమే ఉద్యోగాల కోతకు కారణమవుతున్నట్లు సమాచారం. ఈ రెస్పిరేటరీ సామగ్రిని రీకాల్ చేసిన తర్వాత ఉద్యోగుల తొలగింపు చేపట్టడం ఇది రెండోసారి. ఫిలిప్స్ సంస్థ గత ఏడాది 2022, అక్టోబర్లో 4,000 మందిని తొలగించింది. గతంలో మాదిరి సంస్థను మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చేందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు డచ్ సంస్థ ఫిలిప్స్ తెలిపింది. ఈ రీకాల్ తో కంపెనీ మార్కెట్ విలువ 70 శాతం మేర తగ్గిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించాలని సంస్థ ప్రణాళికలు చేస్తోంది. 2025 నాటికి మిగిలిన 50 శాతం వర్క్ ఫోర్స్ పై నిర్ణయం తీసుకోనుంది.
Read Also: Chintakayala Vijay: అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారు