Site icon NTV Telugu

Phil Salt: ఆర్సీబి ఊపిరి పీల్చుకో.. అందుబాటులోకి విధ్వంసక ప్లేయర్..!

Phil Salt

Phil Salt

Phil Salt: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఫైనల్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నాలుగోసారి చేరుకుంది. మరోవైపు వారి ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు రెండోసారి ఫైనల్ కు చేరుకుంది. అయితే ఇరు జట్లు ఒక్కసారి కూడా విజయం అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయం. ఇకపోతే, తాజాగా ఆర్సీబీ జట్టుకి సంబంధించిన ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ తండ్రి అయ్యాడు. తన మొదటి సంతానం పుట్టిన సమయంలో ఇంగ్లాండ్ వెళ్లిన సాల్ట్, ఇప్పుడు తిరిగి భారత్‌కు వచ్చారు. దీంతో ఆయన ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు.

Read Also: IPL 2025 Final: వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే.. నెక్స్ట్ ఏంటి..? రిజర్వ్ డే ఉందా..?

నేటి ఉదయం సాల్ట్ అహ్మదాబాద్‌కు చేరుకోవడంతో ఇది ఆర్సీబీ అభిమానులకు శుభవార్తగా మారింది. 29 మేన జరిగిన క్వాలిఫయర్ 1లో పాల్గొన్న సాల్ట్ ఆ తరువాత తన భార్య, పుట్టబోయే వారికోసం స్వదేశానికి వెళ్లాడు. ఆర్సీబీ ట్రైనింగ్ సెషన్లలో సాల్ట్ గైర్హాజరు కావడంతో అభిమానుల్లో ఆయన లభ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అహ్మదాబాద్ విమానాశ్రయానికి ఆయన తిరిగి వచ్చిన ఫొటోలు వైరల్ కావడంతో ఆ అనుమానాలకు ముగింపు పలికింది.

Read Also: IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!

ఇకపోతే, ఫిలిప్ సాల్ట్ ఈ సీజన్‌లో ఆర్సీబీకి కీలక ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 175.9 స్రైక్ రేట్, 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. ఇక ముఖ్యంగా క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ 27 బంతుల్లోనే 56 పరుగులు చేయడంతో ఆర్సీబీ విజయంలో కీలకంగా మారింది. మొత్తంగా ఫిలిప్ సాల్ట్ తిరిగి రావడంతో ఆర్సీబీకి ఫైనల్‌లో ఒక మానసిక ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఇంతకుముందే కీలక మ్యాచ్‌లో మెరిసిన సాల్ట్, ఇప్పుడు తన కుటుంబానికి, జట్టుకి సమాన ప్రాధాన్యతనిస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఫైనల్‌లో కూడా ఆయన ఆటతీరు ఆర్సీబీ విజయంలో కీలకమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version