Site icon NTV Telugu

Student Suicide: ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య.. నెల రోజుల్లో 3వ ఘటన

Student Suside

Student Suside

దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇన్‌స్టిట్యూట్ మరో ఆత్మహత్య వార్త సంచలనం రేపుతుంది. నెల రోజుల్లో ఇది ఆత్మహత్య ఘటన. ఇంతకు ముందు కొన్ని రోజుల్లోనే రెండు ఆత్మహత్య ఘటనలు నమోదయ్యాయి. ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందిన కాన్పూర్ ఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సంస్థ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రియాంక అనే పీహెచ్‌డీ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారితో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని.. ఘటనపై ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనపై ఏడీసీపీ వెస్ట్ ఆకాష్ పటేల్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 1 గంటకు ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఎస్‌హెచ్‌ఓను బలగాలతో క్యాంపస్‌కు పంపించారు. ఫోరెన్సిక్ విభాగం ఆధారాలు సేకరిస్తేనే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయన్నారు. అదే సమయంలో విద్యార్థి మృతిపై తోటి విద్యార్థులు కూడా మౌనంగా ఉన్నట్లు తెలిపారు.

కాగా.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నివాసి. విద్యార్థిని ప్రియాంక వయస్సు 29 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తేల్చారు. అయితే.. ఆమే 10 రోజుల క్రితమే కాన్పూర్ ఐఐటీలో పీహెచ్‌డీలో అడ్మిషన్ తీసుకుంది. ఇంతకుముందు డిసెంబర్ మూడో వారంలో ఒరిస్సాకు చెందిన రీసెర్చ్ ఫ్యాకల్టీ సభ్యురాలు డాక్టర్ పల్లవి.. జనవరి మొదటి వారంలో మీరట్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి వికాస్ మీనా క్యాంపస్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐఐటీ కాన్పూర్‌లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు.. పరిపాలనా అధికారుల పని తీరుపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదువుల ఒత్తిడిని ఎవరూ పరిష్కరించలేరని విద్యార్థులు అంటున్నారు.

Exit mobile version