NTV Telugu Site icon

Phani: పాన్ ఇండియా థ్రిల్లర్‌లో ఛాలెంజింగ్ రోల్ కొట్టేసిన కేథరిన్.. ఆమె క్యారెక్టర్ సూపరేహే!!

Phani

Phani

Phani: డైరెక్టర్ డా. వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు మూవీ మేకర్స్. ఈ థ్రిల్లర్ జోనర్ లో రాబోయే సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. తాజాగా ఫణి సినిమా టైటిల్, ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అమెరికాలోని డల్లాస్ లో జరిగింది. సినిమా సినిమా టైటిల్ ను డాక్టర్ తోటకూర ప్రసాద్ లాంఛ్ చేయగా.., ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఈ సందర్బంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి, డా. ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ అతిథులుగా పాల్గొని ‘ఫణి’ సినిమా టీమ్ కు తమ విషెస్ అందించారు.

Azharuddin: మనీలాండరింగ్ కేసులో విచారణకు క్రికెటర్ అజారుద్దీన్‌కు సమన్లు!

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ – ఫణి సినిమాతో వీఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో మా ఓ.ఎం.జీ ప్రొడక్షన్ బ్యానర్ పై తొలి ప్రయత్నం చేస్తున్నాము. నేను ఇప్పటిదాకా మీకు బాగా మ్యూజిక్ చేస్తానని, పాటలు పాడతానని తెలుసు. ఈ రోజు మూవీ టైటిల్ లాంఛ్ కు వచ్చిన నిర్మాత అనిల్ సుంకర గారికి, తోటకూర ప్రసాద్ గారికి, ఇతర అతిథులు అందరికీ థ్యాంక్స్ అంటూ తెలిపింది. ఇక యాక్టర్ మహేశ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ మూవీలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. డా. ఆదిత్య గారి దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని., ఆయన సినిమాలను మనం ఎంతగానో ఇష్టపడతామని., ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు.

అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మాట్లాడుతూ.. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ టాలీవుడ్ మూవీ మేకింగ్ లోకి రావడం హ్యాపీగా ఉందని., ఈరోజు 90శాతం టాలీవుడ్ మూవీ ప్రొడక్షన్ చేస్తున్నది అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రొడ్యూసర్సే అని తెలిపారు. సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా.. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ లో మరిన్ని మూవీస్ రావాలన్నారు.

Jani Master-Bail: జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్!

ఈ సందర్బంగా హీరోయిన్ కేథరీన్ మాట్లాడుతూ.. ఫణి మూవీ కథ విన్న వెంటనే ఈ మూవీ చేస్తానని చెప్పానని, కథ నన్ను అంతగా ఇంప్రెస్ చేసిందని., నా కెరీర్ లో చేస్తున్న ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదేనని చెప్పగలను అంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే మీ ముందుకు ఓ మంచి థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాం అని అన్నారు. ఇక డైరెక్టర్ డా. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఫణి మూవీ టైటిల్ లాంఛ్ చేసిన డా. తోటకూర ప్రసాద్, బ్యానర్ లాంఛ్ చేసిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, ఇతర గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్ అంటూ.. కేథరీన్ లేకుంటే మా ఫణి మూవీ లేదని., ఈ మూవీకి వర్క్ చేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ అని., మీ సపోర్ట్ తో త్వరలోనే సినిమాను కంప్లీట్ చేస్తాం. ప్రీ రిలీజ్, ప్రీమియర్స్ లో మళ్లీ మనందరం కలుసుకుందాం అని అన్నారు.

Show comments