సంగారెడ్డిలో పీజీ మెడికల్ విద్యార్థి ఆదృశ్యం కలకలం రేపుతుంది. తమిళనాడుకి చెందిన పీజీ మెడికల్ స్టూడెంట్ గోకుల్ నాథ్ తండ్రికి సూసైడ్ నోట్ వాట్సాప్ చేసి అదృశ్యమైయ్యాడు. నిన్నటి నుంచి గోకుల్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుందని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మహారాష్ట్రలో ఉన్నట్టు సమాచారం. అయితే, గోకుల్ నాథ్ సంగారెడ్డిలోని ఫసల్ వాదిలో ఓ ప్రయివేట్ హాస్టల్లో ఉంటూ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గోకుల్ నాథ్ పీజీ చదువుతున్నాడు.
Read Also: Unlimited Food: కేవలం రూ.2కే మీకు రిచ్ పర్సన్స్ తినే క్వాలిటీ ఫుడ్.. పట్టినంత తినేయవచ్చు
అయితే, ఈ నెల5వ తారీఖున ఉదయం ఆస్పత్రిలో డ్యూటికి వెళ్లి హాస్టల్ కి గోకుల్ నాథ్ తిరిగివచ్చారు. అదే రోజు రాత్రి 8గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటికి వెళ్లిన గోకుల్.. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నిన్న తెల్లవారుజామున హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి గోకుల్ గురించి తండ్రి మురుగన్ ఆరా తీశారు. హాస్టల్ లో లేడని సమాచారం ఇవ్వడంతో తమిళనాడు నుంచి హుటాహుటిన గోకుల్ నాథ్ తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Read Also: Animal Holiday: ఇకపై జంతువులకు ‘ఒక రోజు’ సెలవు.. ఎక్కడో తెలుసా?
పీజీ విద్యార్థి గోకుల్ నాథ్ మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అసలు గోకుల్ నాథ్ ఎందుకు హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు, తన తండ్రికి సూసైడ్ పంపడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గోకుల్ నాథ్ కు ఎవరితోనైన విభేదాలు ఉన్నాయా.. లేదంటే మరెదైన సమస్య వల్ల ఇలా చేశాడా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.