Site icon NTV Telugu

PG Medical : మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త.. పీజీ మెడికల్ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కుల తగ్గింపు

Kaloji

Kaloji

పీజీ మెడికల్ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కుల తగ్గించినట్లు కాళోజి హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు వరంగల్ కాళోజి హెల్త్ యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నీట్‌’ కటాఫ్‌ స్కోర్ ను 25శాతం కేంద్రం తగ్గించింది. కటాఫ్‌ తగ్గడంతో కన్వీనర్, యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి మరో మారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రకటించింది. కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు.. యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24 నుండి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ మెడికల్ నీట్ కట్ ఆఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం తెలిపింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం నేడు పీజీ మెడికల్ కన్వీనర్‌ అదే విధంగా యాజమాన్య కోటా సీట్ల దరఖాస్తుకు మరో ప్రకటన విడుదల చేసింది.
Also Read : Kavi Samrat Review: కవిసమ్రాట్ రివ్యూ (ఆహాలో)

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్‌ 2022 పీజీ అర్హత కటాఫ్‌ స్కోరును 25 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 25 శాతం 201 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి 15 శాతం 169 మార్కులు, దివ్యాంగులకు 20 శాతం 186 మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు. కటాఫ్‌ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుండి నుండి 26వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు అదే విధంగా యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుండి 27వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Exit mobile version