Site icon NTV Telugu

PG Counselling : సెప్టెంబర్ 5 నుంచి పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్

Pgcet

Pgcet

సెప్టెంబర్ 5 నుంచి పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ TS: సెప్టెంబర్ 5 నుంచి PG ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం SEP 5 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. సెప్టెంబర్‌ 20 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లు, సెప్టెంబర్‌ 23న ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 26న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 29లోగా తమకు వచ్చిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అటు అక్టోబర్ 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. సెప్టెంబరు 26న మొదటి విడత పీజీ సీట్లను కేటాయించనున్నట్టు కన్వీనర్‌ పాండురంగారావు తెలిపారు. సెప్టెంబరు 29లోగా అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందన్నారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం అక్టోబరు 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ హెచ్‌, మహిళా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఈడీ తదితర 66 పీజీ కోర్సుల్లో ప్రవేశాలను భర్తీ చేస్తారు.

Also Read : Rajini: జైలర్ కి షాక్… కలెక్షన్స్ ఫుల్ ఉండగానే ఒరిజినల్ ప్రింట్ లీక్…

ఇదిలా ఉంటే.. తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. న్యాయపరమైన అడ్డంకులు తొలగితే.. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఫలితాలు విడుదల అవకాశం ఉంది. అయితే.. తెలంగాణ ప‌బ్లిక్‌ స‌ర్వీస్ క‌మిష‌న్ . TSPSC Group-1 ప్రిలిమినరీ పరీక్ష ఫ‌లితాల‌ విడుదలకు సంబంధించి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే హైకోర్టు తీర్పుతో ఈ ఫ‌లితాల విడుద‌ల ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. తెలంగాణలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 11వ తేదీన‌ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించిన విష‌యం తెలిసిందే. TSPSC Group-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

Also Read : Telangana: తెలంగాణ సర్కార్ మరో శుభవార్త.. అర్చకుల జీతం రూ.10 వేలకు పెంపు

Exit mobile version