NTV Telugu Site icon

Petrol Tankers Strike: రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె.. బంకుల వద్ద భారీగా క్యూ లైన్

Hit And Run

Hit And Run

రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హిట్ అండ్ రన్’ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది. దీంతో ముందస్తు వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీ ఎత్తున క్యూ కడుతున్నారు.

Read Also: Hit-And-Run Law: కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్ పంపుల వద్ద రద్దీ..

భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం.. భారతీయ శిక్షాస్మృతిని భర్తీ చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదాన్ని కలిగించి, పోలీసులకు లేదా పరిపాలనలోని ఏ అధికారికి సమాచారం ఇవ్వకుండా పారిపోయిన డ్రైవర్లకు గరిష్టంగా 10 సంవత్సరాల శిక్ష లేదా 7 లక్షల జరిమానా విధించింది. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు.

Read Also: Devil: సైలెంట్ హిట్ గా నిలిచేలా ఉంది… డే 4 > డే 1

కాగా.. రంగారెడ్డి జిల్లా నగర శివారులో పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, ఉప్పర్ పల్లిలోని పలు పెట్రోల్ బంకులు వద్ద రద్దీ పెరిగింది. అంతేకాకుండా.. కొన్ని పెట్రోల్ బంక్ లలో స్టాక్ లేదంటూ పెట్రోల్ బంకుల ఎంట్రీ క్లోజ్ చేసింది యూజమాన్యం. రేపటి నుంచి పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ యజమానుల సమ్మె కారణంగా రద్దీ ఏర్పడింది.