NTV Telugu Site icon

Petrol Rate: అక్కడ బంకుల్లో కంటే బ్లాక్ లోనే రేటు తక్కువట

Petrol Price Eps12

Petrol Price Eps12

ఎక్కడైనా బంకుల్లో పెట్రోల్ రేట్లు తక్కువగా ఉంటాయి. బ్లాకులో రేటు కాసింత ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ మాత్రం బ్లాకులో తక్కువ…బంకులోనే ఎక్కువ రేట్లకు దొరుకుతుందటా పెట్రోల్. దింతో బంకులన్ని ఖాళీ అయ్యి బ్లాక్ దుకాణాల దగ్గర మాత్రం పెట్రోల్ కోసం క్యూ కడుతున్నారట. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా ఈస్టోరీ చూసెయ్యండి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం. ఈ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. ఇక్కడి నుంచి కర్ణాటక, మహారాష్ట్రకి రోజు వందలాది మంది ప్రయాణాలు చేస్తుంటారు.

అయితే పెట్రోల్ రేట్లు తెలంగాణలో కంటే కర్ణాటకలో తక్కువగా ఉండటంతో నారాయణఖేడ్ సరిహద్దు ప్రాంతాల్లో కొందరు బ్లాక్‌ దందాకి తెరలేపారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలయిన కంగ్టి, నాగల్‌గిద్ద, మనూర్‌ మండలాలోన్ని గ్రామాల్లో పెట్రోల్‌ బంకుల్లో కాకుండా దుకాణాల్లోనే ఎక్కువగా పెట్రోల్‌, డీజిల్ దొరుకుతుంది. దీనికి కారణం పెట్రోల్ బంకుల్లో కాకుండా బ్లాక్‌లోనే పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు దొరుకుతుంది. తెలంగాణలో ప్రస్తుతం పెట్రోల్ 110 రూపాయలు, డీజిల్ 100 రూపాయలుగా ఉంది. అయితే నారాయణఖేడ్ సరిహద్దు ప్రాంతాల నుంచి కర్ణాటకకి కేవలం 16 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.

Read Also: Pathan Movie: పఠాన్ టికెట్ ఇప్పించండి, లేదంటే చచ్చిపోతా.. ఫ్యాన్‌పై ఎటాక్

అక్కడ పెట్రోల్, డీజిల్ తెలంగాణ కంటే 10 రూపాయలు తక్కువకే వస్తుంది. బల్క్‌లో పెట్రోల్ కొట్టించే వాహనదారులందరూ కర్ణాటక సరిహద్దు ప్రాంతాల బంకులకు క్యూ కడుతున్నారు. ఈ వ్యవహారం గత కొంతకాలంగా నడుస్తుంది. అయితే ఇప్పడు మరో నయా ట్రెండ్ మొదలైంది. సరిహద్దు గ్రామాల్లోని దుకాణాల్లో కూడా ఇప్పుడు పెట్రోల్‌ బంకుల కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది. దుకాణదారులు కూడా క్యాన్‌లలో బల్క్‌ రూపంలో పెట్రోల్, డీజిల్ తెచ్చుకుని… 5 రూపాయల లాభంతో అంటే కర్ణాటకలో 100 రూపాయలు పెట్రోల్ ఉంటే 105 రూపాయలకు అమ్ముతున్నారు.

ఇటు తెలంగాణలో పెట్రోల్‌ బంకుల్లోనే లీటర్ పెట్రోల్ 110 రూపాయలు ఉంది. దీంతో వాహనదారులు కూడా దుకాణాల్లోనే తక్కువకు దొరుకుతుందని అక్కడే పెట్రోల్ తీసుకుంటున్నారు. దీంతో నారాయణఖేడ్‌లో పెట్రోల్ బంకులన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బంకు నిర్వాహకులు మాత్రం బ్లాక్‌లో పెట్రోల్ అమ్మకాలతో తమ వ్యాపారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 4 నుంచి 5 వేల లీటర్ల డీజిల్, పెట్రోల్ అమ్ముడు పోయేదని ఇప్పుడు కనీసం వెయ్యి లీటర్ల ఇంధనం కూడా అమ్ముడుపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తాము నష్టపోతామని చెబుతున్నారు పెట్రోల్‌బంక్ నిర్వాహకులు. అధికారులు వెంటనే పక్క రాష్ట్రాల నుంటి పెట్రో సరఫరాను నిలిపివేసి రవాణా చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకుంటే ఏం కాదని..వాహనాల్లోపెట్రోల్‌ తరలిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే భారీ విస్పోటనం జరిగే అవకాశముందని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని సరిహద్దు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Read Also: Pathan Movie: పఠాన్ టికెట్ ఇప్పించండి, లేదంటే చచ్చిపోతా.. ఫ్యాన్‌పై ఎటాక్

Show comments