Hyderabad: షాకింగ్.. నగరంలో మూత పడుతున్న పెట్రోల్ బంకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతి తగ్గింది.. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర 2 రూపాయల 26 పైసలు పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణా పెట్రోలియం డీలర్స్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి మాట్లాడారు. ఈ రోజు ఉదయం పవర్ పెట్రోల్ పై 2 రూపాయల 26 పైసలు ధర పెరిగిందని వెల్లడించారు.. ఇంచుమించు నార్మల్ పెట్రోల్, డీజిల్ కూడా ధర పెరిగే అవకాశం కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత పెరుగుతుంది అనేది మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. డాలర్ రేటు పెరిగింది, బ్యారేల్ ధర కూడా పెరిగి ప్రభుత్వంపైన భారం పడే అవకాశం ఉందన్నారు.. కాబట్టి ధరలు పెరుగుతాయని మేము ఒక అంచనాకు వచ్చామన్నారు..
READ MORE: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
- SRH Vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
గడిచిన రెండు మూడేళ్ళలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని అమరేందర్ రెడ్డి వెల్లడించారు.. “ఇప్పుడు కూడా డైరెక్ట్‌గా 10 రూపాయలు పెరగకపోవచ్చు.. గతంలో 2022లో దీపావళికి ఎక్కువ స్టాక్ పెట్టినప్పుడు డిమాండ్ పెరిగింది.. అప్పుడు ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీ విత్‌డ్రా చేసుకుంది. ఇప్పుడు అర్ధాంతరంగా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేసాయి.. ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ డ్యూస్ తో పాటు అడ్వాన్స్ కూడా కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు. దీంతో 40 శాతం పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి.. వెంటనే అంత డబ్బు సమకూర్చడం డిలీర్లకు సాధ్యం కాదు. గతంలో ఆయిల్ కంపెనీలు అడగకున్న ఫోర్స్ గా క్రెడిట్ ఇచ్చే వారు.. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వసూల్ చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మరో వైపు పెట్రోల్ దొరకదేమో అనే భయంతో 100 రూపాయలు పోసుకునే వాళ్ళు ఎక్కువ మొత్తంలో పోసుకోవడం కూడా ఈ కొరత కు కారణం అవుతుంది. పెట్రోల్ వినియోగం పై ప్రజలకు ప్రభుత్వం అవగాహనా కల్పిస్తే ఈ షార్టేజ్ ను కొంతమేర తగ్గించవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ చేసిన వాళ్లకు కూడా డిమాండ్ కు సరిపడా స్టాక్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇవ్వలేక పోతున్నారు.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
తాజావార్తలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
SRH Vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..