Hyderabad: గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దిగుమతి తగ్గింది.. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే పవన్ పెట్రోల్ ధర 2 రూపాయల 26 పైసలు పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ లేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ అంశంపై తెలంగాణా పెట్రోలియం డీలర్స్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి మాట్లాడారు. ఈ రోజు ఉదయం పవర్ పెట్రోల్ పై 2 రూపాయల 26 పైసలు ధర పెరిగిందని వెల్లడించారు.. ఇంచుమించు నార్మల్ పెట్రోల్, డీజిల్ కూడా ధర పెరిగే అవకాశం కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత పెరుగుతుంది అనేది మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. డాలర్ రేటు పెరిగింది, బ్యారేల్ ధర కూడా పెరిగి ప్రభుత్వంపైన భారం పడే అవకాశం ఉందన్నారు.. కాబట్టి ధరలు పెరుగుతాయని మేము ఒక అంచనాకు వచ్చామన్నారు..
READ MORE: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
గడిచిన రెండు మూడేళ్ళలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని అమరేందర్ రెడ్డి వెల్లడించారు.. “ఇప్పుడు కూడా డైరెక్ట్‌గా 10 రూపాయలు పెరగకపోవచ్చు.. గతంలో 2022లో దీపావళికి ఎక్కువ స్టాక్ పెట్టినప్పుడు డిమాండ్ పెరిగింది.. అప్పుడు ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా ఎక్సైజ్ డ్యూటీ విత్‌డ్రా చేసుకుంది. ఇప్పుడు అర్ధాంతరంగా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేసాయి.. ఇప్పటి వరకు ఉన్న క్రెడిట్ డ్యూస్ తో పాటు అడ్వాన్స్ కూడా కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు. దీంతో 40 శాతం పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి.. వెంటనే అంత డబ్బు సమకూర్చడం డిలీర్లకు సాధ్యం కాదు. గతంలో ఆయిల్ కంపెనీలు అడగకున్న ఫోర్స్ గా క్రెడిట్ ఇచ్చే వారు.. ఇప్పుడు వాళ్ళ డబ్బులు వసూల్ చేసుకోవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మరో వైపు పెట్రోల్ దొరకదేమో అనే భయంతో 100 రూపాయలు పోసుకునే వాళ్ళు ఎక్కువ మొత్తంలో పోసుకోవడం కూడా ఈ కొరత కు కారణం అవుతుంది. పెట్రోల్ వినియోగం పై ప్రజలకు ప్రభుత్వం అవగాహనా కల్పిస్తే ఈ షార్టేజ్ ను కొంతమేర తగ్గించవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ చేసిన వాళ్లకు కూడా డిమాండ్ కు సరిపడా స్టాక్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇవ్వలేక పోతున్నారు.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!
