NTV Telugu Site icon

Petrol and Diesel Price: తగ్గిన ముడి చమురు ధరలు.. భారత్‌లో మారిన పెట్రో ధరలు

Petrol

Petrol

Petrol and Diesel Price: భారత్‌లో పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి.. ముడి చమురు ధరలు పెరిగినప్పుడు భారత్‌లో వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి.. కానీ, ముడి చమురు ధరలు తగ్గిన ప్రతీసారి పెట్రో ధరలు తగ్గించడం లేదు.. మరోసారి ముడి చమురు ధరలు తగ్గాయి.. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ముడిచమురు ధర తగ్గినప్పటికీ, నేడు దేశంలోని చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ నిర్ణయిస్తాయి. ఈ ధర ప్రతి రోజు ఉదయం 6 గంటలకు జారీ చేయబడుతుంది.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఈరోజు పెట్రో ధరల విషయానికి వస్తే దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారాయి. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నై వంటి నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి. వీటిలో ఎలాంటి మార్పు లేదు. అదే సమయంలో, ముడి చమురు నేడు రెడ్ మార్క్‌లో ట్రేడవుతోంది. నేడు డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.40 శాతం క్షీణించింది మరియు ఇది బ్యారెల్కు 70.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.37 శాతం తగ్గి బ్యారెల్‌కు 74.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Read Also: CM KCR: నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్‌

ఇక, భారత్‌లో పెట్రోల్‌ డీజిల్‌ ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో పెట్రోల్ రూ. 96.72, డీజిల్ రూ. 89.62గా.. చెన్నైలో పెట్రోలు రూ.102.63, డీజిల్‌ రూ.94.24గా.. ముంబైలో పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా.. కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ లీటరుకు రూ.92.76గా కొనసాగుతోంది.. అయితే, ఏ నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారాయి అనే విషయానికి వెళ్తే.. అహ్మదాబాద్‌లో పెట్రోలు ధర 20 పైసలు తగ్గి రూ. 96.42కి, డీజిల్ 21 పైసలు తగ్గి రూ. 92.17గా ఉంది.. నోయిడాలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ. 97గా, డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 90.14గా ఉంది. ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 14 పైసలు పెరిగి రూ.96.58కి, డీజిల్ ధర 123 పైసలు పెరిగి రూ.89.75కి చేరింది. గురుగ్రామ్‌లో పెట్రోల్ 8 పైసలు తగ్గి రూ. 96.89 వద్ద, డీజిల్ లీటరుకు 8 పైసలు తగ్గి రూ. 89.76 వద్ద ఉంది. జైపూర్‌లో పెట్రోల్ ధర 40 పైసలు పెరిగి రూ. 108.48గా, డీజిల్ 36 పైసలు పెరిగి లీటర్ రూ. 93.72 దగ్గర కొనసాగుతోంది. లక్నోలో పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.96.62కి చేరుకుంది. డీజిల్ ధర 5 పైసలు పెరిగి లీటర్ రూ.89.81కి చేరుకుంది.

Show comments