NTV Telugu Site icon

Supreme Court: సుప్రీం కోర్టు కూల్చొద్దు.. పిటిషన్‌లో ఇంకేముందంటే..!

Sue

Sue

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఉన్న భవనాన్ని కూల్చే బదులు.. వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాలని పిటిషనర్ పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో 17 కోర్టు గదులు, రెండు రిజిస్ట్రార్ కోర్టు గదులు ఉన్నాయని, కేంద్రం మొత్తం భవనాన్ని కూల్చివేయబోతోందని, నాలుగు రిజిస్ట్రార్ కోర్టు గదులతో 27 కోర్టు గదులను పునర్నిర్మించేందుకు రూ. 800 కోట్లు వెచ్చించబోతోందని పిల్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య స్పెషల్ అనౌన్సమెంట్

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిర్మించిన ముఖ్యమైన స్మారక భవనాలలో భారతదేశ సుప్రీంకోర్టు భవనం ఒకటని, ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ప్రైవేట్ ఆస్తులలో పనిచేస్తున్న అనేక కోర్టులు, ట్రిబ్యునళ్లుచ, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని.. వాటికి వసతి కల్పించవచ్చని పిటిషన్‌లో పేర్కొన్నాడు. సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చివేయడానికి బదులు మరో ప్రయోజనం కోసం ఉపయోగించాలని పిటిషనర్ కెకె రమేష్ స్పష్టం చేశారు. కొత్త భవనానికి సంబంధించిన నమూనాను కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదని, ప్రజలతో పాటు బార్‌ అసోసియేషన్‌లతోనూ దీనిపై చర్చించలేదన్నారు.

ఇది కూడా చదవండి: Medicine Side Effects: మందుల వల్ల ఎన్నిరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా?

ప్రస్తుతం 17 కోర్టు రూమ్‌లు, రెండు రిజస్ట్రీ రూమ్‌లు ఉన్నాయి. ఈ మొత్తం భవనాన్ని కూల్చివేసి రూ.800 కోట్లతో కొత్త భవనం నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందులో 27 కోర్టు రూమ్‌లు, నాలుగు రిజిస్ట్రీ రూమ్‌లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. సుప్రీం కోర్టులో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున పదేళ్ల తర్వాత ఇవి కూడా సరిపోవు అని కేకే రమేష్‌ అనే వ్యక్తి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Liquor Truck Accident: డ్రైవర్ సహాయం కోసం ఎదురు చూస్తుంటే.. మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్తున్న ప్రజలు..

Show comments