పలు రకాల మందులు తరచూ వాడితే వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. వాటి గురించి తెలుసుకుందాం. 

కండరాలు పట్టేయకుండా సైక్లోబెంజప్రైన్‌, మెథోకార్బమోల్‌, క్యారిసోప్రోడోల్‌ వంటి మందులను డాక్టర్లు సూచిస్తుంటారు. వీటితో తికమక పడటం, తూలటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు.  

దీర్ఘకాలం పనిచేసే క్లోర్‌ప్రొపమైడ్‌, గ్లైబురైడ్‌ వంటి సల్ఫోనైలూరియా రకం మందులు రక్తంలో గ్లూకోజు బాగా పడిపోయేలా (హైపోగ్లైసీమియా) చేయొచ్చు.

తుమ్ములు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలకు యాంటీహిస్టమిన్‌ మందులు వేసుకుంటుంటారు.  ఇవి నిద్రమత్తు, తికమక కలిగించొచ్చు.

మూత్రం ఆపలేనివారికి, పార్కిన్సన్స్‌తో బాధపడేవారికి డాక్టర్లు యాంటీకొలెనెర్జిక్‌ మందులు సూచిస్తుంటారు.  మలబద్ధకం వంటి సమస్యలకు దారితీయొచ్చు.

కొందరు నిద్ర మాత్రలూ వాడుతుంటారు. ఇందులో ఉండే డైఫెనీడ్రమైన్‌ మందు నోరు తడారటం, చూపు మసక బారటం, మూత్రాశయ సమస్యలకూ దారితీస్తుంది.

వృద్ధుల్లో మలబద్ధకం పెద్ద సమస్య.  బైసకోడీల్‌ వంటి లాగ్జేటివ్‌ మందులు మేలు చేస్తాయి. దీర్ఘకాలం తీసుకుంటే మలబద్ధకం అలాగే కొనసాగేలా చేయొచ్చు.

సొంతంగా కొనుక్కొని వేసుకునే వాటిల్లో రెండు, మూడు మందులు కలిసి పోయి ఉండొచ్చు. ఇవి తికమక, మత్తు, తూలటం, రక్తపోటునూ పెంచొచ్చు.  

ఐబూప్రొఫెన్‌, ఆస్ప్రిన్‌, నాప్రోక్జెన్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులు కిడ్నీలు, కాలేయం, గుండె, జీర్ణాశయం, పేగుల వంటి అవయవాల మీదా నొప్పి మందులు విపరీత చూపుతాయి.