Site icon NTV Telugu

Teacher Harassment : విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడు

Harassment

Harassment

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ హోదాలో ఉన్న వ్యక్తి తన విద్యార్థులపై కన్నేసాడు. కామంతో వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌ ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్ లో 8 తరగతి విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తించాడు పీఈడీ టీచర్‌ విష్ణు. విద్యార్థిని తో అసభ్యంగా ప్రవర్తించి, దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేవాడు. అయితే.. విద్యార్థిని ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. . స్కూల్ వద్దకు విద్యార్ధిని తల్లిదండ్రులు చేరుకున్నారు. స్కూల్ లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేసి, కంప్యూటర్ రూమ్ ను పగలగొట్టారు తల్లిదండ్రులు వారి బంధువులు.

Also Read : Ruchitha Sadineni: క్యూట్ లుక్స్ తో రుచిత సాధినేని ఫోజులు

స్కూల్ లో ఉన్న ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయుల పై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే.. పీఈటీ విష్ణు పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి విష్ణు పారిపోయాడు. ఈ మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఓ పక్కా తరచూ చైల్డ్ అబ్యూజ్ పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఆ కార్యక్రమాలు జరుగుతుంటే స్కూల్ లో ఈ అమానుషం ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్ధి సంఘాలు.. విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందని, ఫీజుల పై పెట్టే దృష్టి విద్యార్థుల రక్షణలో లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో.. ఎన్‌టీవీతో SR DIGI స్కూల్ పేరెంట్స్ మాట్లాడుతూ..

‘స్కూల్ స్టూడెంట్స్ తో పిటి సార్ విష్ణు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఫోన్ చేసి వేధిస్తున్నదు P.E.T టిచర్ విష్ణు. విష్ణు వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు మాకు విషయం చెప్పారు. మేము తల్లిదండ్రులుగా ప్రిన్సిపాల్‌ను నిలదీశాము. మేము అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాము. స్కూల్ లో పీఈటీ విష్ణు ఎస్కేప్ లో ఉన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. విష్ణు ను తొలగిస్తామని ప్రిన్సిపల్ వనిత హామీ ఇచ్చింది. అమ్మాయిల పై చేయి వేయడం, వాష్ రూం వద్ద డోర్ వద్ద ఉండడం, డోర్ కర్టెన్ తీస్తూ వేధిస్తున్నాడు అని పిల్లలు మాకు చెప్పారు. స్కూల్ ముగిసినాక ఫోన్ కాల్స్ చేయడం విష్ణు కు ఏం అవసరం. సోమవారం రమ్మన్నారు అప్పుడు ఏంఈఓ తో మాట్లాడుతామని తెలిపారు.

Exit mobile version