బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్ జట్టు నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఆష్టన్ టర్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
Party time in Perth 🏆 #BBL12 pic.twitter.com/vLGgTixaEU
— KFC Big Bash League (@BBL) February 4, 2023
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్రిస్బేన్ బ్యాటర్లలో మెక్ స్వీనే (41), మ్యాక్స్ బ్రాంట్ (14 బంతుల్లో 31) రాణించారు. పెర్త్ బౌలర్లలో బెహ్రండార్ఫ్, కెల్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దీ, టై తలా వికెట్ సాధించారు.అనంతరం176 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో పెర్త్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. కెప్టెన్ టర్నర్ (32 బాల్స్‌లో 53)తో పాటు చివర్లో నిక్ హబ్సన్ (7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కన్నోలి (11 బంతుల్లో 25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజేతగా నిలిపారు. బ్రిస్బేన్ బౌలర్లలో జేవియర్ , మాథ్యూ కుహ్నెమాన్, స్పెన్సర్ జాన్సెన్ చెరో వికెట్ సాధించారు.
ఆండ్రూ టై ప్రపంచ రికార్డు
ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ దక్కించుకున్న పెర్త్ స్క్రాచర్స్ పేసర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు బుక్కుల్లోకి ఎక్కాడు. టై 211 మ్యాచ్‌ల్లో 300 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ 213 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. తద్వారా రషీద్ రికార్డును టై బ్రేక్ చేశాడు.
ప్రైజ్ మనీ, అవార్డులు
పెర్త్ స్క్రాచర్స్ (విన్నర్) – 2.8 కోట్లు దాదాపు
బ్రిస్బేన్ హీట్ (రన్నరప్) – 1.24 కోట్లు దాదాపు
ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ – ఆష్టన్ టర్నర్
గోల్డెన్ బ్యాట్ (అత్యధిక రన్స్) – ఆరోన్ హార్డీ (460 రన్స్)
గోల్డెన్ ఆర్మ్ (అత్యధిక వికెట్లు) – సీన్ అబాట్ (29 వికెట్లు)
Also Read: Dipa Karmakar: అవన్నీ తప్పుడు వార్తలు..నిషేధంపై దీపా కర్మాకర్ స్పందన