Site icon NTV Telugu

Perni Nani: బాబువి డైవర్షన్‌ పాలిటిక్స్‌.. అందుకే ఇదంతా..?

Perni Nani

Perni Nani

Perni Nani: ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై స్పందిస్తూ.. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరు.. కానీ, రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట.. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కేబినెట్ లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు.. కానీ, ఇతర అంశాలపై చర్చించారంటూ ఎద్దేవా చేశారు.. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు.. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.. హామీలకు పంగనామాలు పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Hizbul Mujahideen: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్.. యూపీలో దాడులకు కుట్ర..

అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు పేర్ని నాని.. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు.. నారాయణకు వైఎస్‌ వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు.. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు.. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారని.. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉందని తెలిపారు. ఇక, శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారని గుర్తుచేశారు.. మరోవైపు.. వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు.. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే అని వెల్లడించారు.. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందాడు.. వాచ్‌మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు.. కానీ, రంగన్న గురించి కేబినెట్‌లో చర్చించారు.. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు.. రంగన్నకు 2+2 గన్ మెన్ లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు.. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారని ఆరోపించారు.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు? అని ప్రశ్నించారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

ఇక, ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు.. మరి పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు అని నిలదీశారు పేర్ని నాని.. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట.. ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు అని నిలదీశారు.. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు.. రంగన్న ఇచ్చిన 164 స్టేట్‌మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు.. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదని తెలిపారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని..

Exit mobile version