Site icon NTV Telugu

Perni Nani: దొంగ ఓట్లను చేర్చి గెలవాలనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుదే..

Perni Nani

Perni Nani

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు అని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ గగ్గోలు పెడుతోంది.. వైసీపీ ప్రభుత్వం.. పార్టీ ఓటర్ల జాబితాలో అక్రమాలు పాల్పడుతోందని విమర్శలు చేస్తున్నారు.. బీజేపీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పదవి పోయిన ఓ నేత వచ్చి మాట్లాడుతున్నారు అని పేర్నినాని అన్నారు.

Read Also: Hair Growth Tips: జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్స్ ను ట్రై చెయ్యాల్సిందే..!

ఉత్తర భారతంలో ఓటర్ల జాబితాలో బీజేపీ అక్రమాలకు పాల్పడినట్టు పాల్పడినట్టు.. ఇక్కడ కుదురుతుందా?.. అని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. 2019కు ముందు 59.18 లక్షల ఓట్లు అక్రమంగా ఉన్నాయి.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్లున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది.. చాలా అక్రమ ఓట్లు.. 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి.. ఓటర్ల జాబితాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి అని ఈసీని కోరామని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా విషయంలో పాపాలు చేసిన టీడీపీ.. ఇప్పుడు వచ్చి మాపై విమర్శలు చేస్తున్నారు అని పేర్నినాని అన్నారు. టీడీపీ చేసిన పాపాల వల్లే ఇప్పుడు ఏపీలో భారీగా నకలి ఓటర్లు ఉన్నారని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. టీడీపీ చేసిన తప్పును వైసీపీ మీద వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ.. సుప్రీంలో పిటిషన్

దొంగ ఓట్లను చేర్చి గెలవాలనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుకే వస్తుంది అని పేర్నినాని అన్నారు. సేవా మిత్ర యాప్ ద్వారా వైసీపీ సానుభూతి పరుల 50 లక్షల ఓట్లను తొలగించారు.. గజ దొంగే నీతి కబుర్లు చెబుతున్నట్టు.. ఆవు తోలు కప్పుకున్న నక్కలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.. వైసీపీపై చంద్రబాబు బురదజల్లుతున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందన్న సంజయ్ కామెంట్లను ఆయన తప్పుబట్టారు. బండి సంజయ్ కు దేవుడు పైన ఊడగొట్టాడు.. బీజేపీ కిందున్న ఛైర్ ఊడగొట్టింది అని ఆయన విమర్శించారు.

Exit mobile version