Perni Nani: తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే.. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణలో వెసులుబాటు అడగడం తప్పా? అని నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఆక్టోపస్ అంటూ మండిపడ్డారు.. చంద్రబాబు అప్పట్లో మోడీతో తగాదా పెట్టుకున్నాడు.. 2014-2019 మధ్య ప్రభుత్వం జీవో 176 తెచ్చింది.. సీబీఐకి చంద్రబాబు ప్రభుత్వ జనరల్ కంసెంట్ ను రద్దు చేస్తూ జీవో విడుదల చేసిందని గుర్తుచేశారు.. కానీ, ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు విషయంలో టీడీపీ, వారి మీడియా చిలవలు, పలవలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు అంటూ అప్పుడు వార్తా కథనాలు రాశారని సెటైర్లు వేశారు. సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తూనే ఉన్నాడు.. తల్లికి హార్ట్ ఎటాక్ రావటంతో దగ్గర ఉండి చూసుకోవటం కోసం వెసులుబాటు కావాలని సీబీఐని అడగటం తప్పా? అంటూ నిలదీశారు.
Read Also: Dimple Hayati: తప్పు ఒప్పు పక్కన పెడితే.. పాప.. ఒక్కసారిగా ఫేమస్ అయిందిగా
కేంద్ర బలగాలు హెలికాప్టర్లలో వచ్చేస్తున్నారు అంటూ ఊదర గొడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు పేర్ని నాని.. అవినాష్ రెడ్డిని కాల్చేస్తారు అని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. చంద్రబాబు ఇంత వరకు ఎప్పుడైనా విచారణకు హాజరయ్యాడా? చంద్రబాబు జీవితం అంతా స్టేలు తెచ్చుకుని బతుకటమేగా? కానీ, ఇప్పుడు ఎందుకు ఇంత కడుపు మంట? అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అవినాష్ రెడ్డి కేసు కోసమే వెళ్ళారని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నాని.. ఇప్పుడు కేంద్రం పదివేల కోట్ల రూపాయల పెండింగ్ నిధులు విడుదల చేస్తే తట్టుకోలేక పోతున్నారన్న ఆయన.. ఈ నిధుల కోసమే ముఖ్యమంత్రి అన్ని సార్లు ఢిల్లీ తిరిగిందన్నారు.. 2014-19లో మధ్య రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులను చంద్రబాబు తీసుకుని రాలేక పోయాడని విమర్శించారు. కానీ, అలుపు ఎరుగని పోరాటం చేసి సీఎం వైఎస్ జగన్ తెచ్చాడని ఎందుకు ఒక్క మాట చెప్పలేక పోతున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.