తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది. జైలులో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేసేందుకు ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. చంద్రబాబు ఉన్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ న్యాయమూర్తి చెప్పారు. చంద్రబాబుకు చర్మ సంబంధించి వ్యాధి వచ్చిన తరుణంలోనే.. ఆయన రూమ్ లో ఏసీ ఏర్పాటుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
Read Also: SBI Super Plan : ఎస్‌బీఐ సూపర్ ప్లాన్.. రూ.10 లక్షల పెట్టుబడితో రూ.30 లక్షలు పొందవచ్చు..
కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు రిమాండ్ నేటికి 37వ రోజుకు చేరుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్టయ్యారు. ఇక, ఈ నెల 19వ తేదీ వరకు ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అటు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న స్నేహా బ్లాక్ లో ఏసీ ఏర్పాటుకు సెంట్రల్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబుకు చర్మ సమస్యలు దృష్ట్యా ఏసీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి చంద్రబాబుకు ఉపసమానం లభించనుంది.