మన ఇంట్లో పెద్దవాళ్ళు జుట్టుకు నూనె రాస్తే బలంగా, ఒత్తుగా పెరుగుతుందని చెబుతుంటారు. కానీ వైద్యులు మాత్రం దీనిని ఒక అపోహ గానే కొట్టిపారేశారు. అవును నూనె రాయడం వల్ల జుట్టు పెరుగుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే నిజానికి జుట్టు ఆరోగ్యం అనేది మన జన్యువులు, మనం తీసుకునే పౌష్టికాహారం, మరియు మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుందట. పాత తరం వారిలో జుట్టు బాగుండడానికి కారణం వారు తీసుకున్న స్వచ్ఛమైన ఆహారమే తప్ప, కేవలం నూనె కాదట. నూనె కేవలం జుట్టుకు ఒక సహజమైన కండీషనర్‌లా పనిచేసి, వెంట్రుకలు మెరిసేలా, చిక్కుపడకుండా మృదువుగా ఉండేలా మాత్రమే చేస్తుంది.
Also Read : Winter : వణుకు పుట్టించే చలి వెనుక.. దాగున్న ఆరోగ్య రహస్యాలేంటి?
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జుట్టుకు నూనె రాయడం వల్ల మరిన్ని కష్టాలు కొనితెచ్చుకుంటారని డాక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా తలలో చుండ్రు ఉన్నవారు నూనె రాస్తే, అది చుండ్రును మరింత పెంచి దురదకు కారణమవుతుంది. అలాగే ముఖంపై మొటిమలు వచ్చే గుణం ఉన్నవారు, సెబోర్హెయిక్ డెర్మటైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు నూనెకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ నూనె రాసే అలవాటు ఉంటే, దానిని తలస్నానానికి కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే రాసుకోవాలని, రాత్రంతా ఉంచడం ఆరోగ్యకరం కాదని వైద్యులు సూచించారు. జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటే నూనెల మీద ఆధారపడకుండా, సరైన వైద్య చికిత్స తీసుకోవడమే ఉత్తమమని వివరించారు.
