Site icon NTV Telugu

Shubman Gill: ఇదే సరైన సమయం.. వన్డేలకు కెప్టెన్ గా గిల్.. క్రికెట్ దిగ్గజం ఏమన్నాడంటే?

Shubman Gill (1)

Shubman Gill (1)

Shubman Gill: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 2–2తో సమం చేసిన అనంతరం టీమిండియాలో కెప్టెన్ మార్పుపై అప్పుడే చర్చ మొదలైంది. ముఖ్యంగా యువ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చూపించిన సామర్థ్యం చూసిన తర్వాత, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఓ కీలక సూచన చేశారు. గిల్‌ను భారత వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా దాదాపు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో, గిల్‌కు లీడర్‌షిప్ బాధ్యతలు అప్పగించాలన్న గవాస్కర్ అభిప్రాయం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Indian Navy Recruitment 2025: 10th, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో జాబ్స్.. మంచి జీతం

రోహిత్, కోహ్లీ వన్డేలకు అందుబాటులో ఉన్నప్పటికీ.. వారిని ప్రస్తుతం ఎంపిక చేయలేదు. సెలెక్టర్లు కొత్త నాయకత్వాన్ని అన్వేషిస్తున్నారనుకుంటే.. వారికి ఇదే సరైన సమయం అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా విండీస్ లేదా ఆస్ట్రేలియాతో జరిగే వచ్చే వన్డే సిరీస్‌లో గిల్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు అని గవాస్కర్ స్పష్టం చేశారు. ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌ అయినప్పటికీ, అతడు 10 ఇన్నింగ్స్‌లలోనే 754 పరుగులు సాధించి మూడు శతకాలు, ఓ డబుల్ సెంచరీ బాదేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో అతని 269 పరుగుల ఇనింగ్స్ భారత్‌కు మ్యాచ్‌ గెలిచిపెట్టిన కీలక ఇన్నింగ్స్‌గా నిలిచింది.

Kia Seltos vs Honda Elevate: SUV కారు కొనాలనుకుంటున్నారా? సేఫ్టీనా.. స్టైలా..?

అతను జట్టులో అందరికీ ఇష్టమైన ఆటగాడు. ఒకసారి సెంచరీ చేసినా సరిపోదు, అతడికి డబుల్ హండ్రెడ్ కావాలి. దాన్ని దాటినా ట్రిపుల్ హండ్రెడ్ వైపు చూస్తాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో అతడు అందించిన 269 పరుగుల ఇన్నింగ్స్ గొప్ప పోరాటపటిమకు నిదర్శనం. ఒక్క క్షణం కూడా తగ్గడం లేదు. ప్రతి పరుగు విలువైనదన్న నమ్మకంతో ఆడాడని గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.

Exit mobile version