NTV Telugu Site icon

Pushpa 2 : పుష్ప 2 థియేటర్లో పెప్పర్ స్ప్రే కలకలం.. ఉక్కిరి బిక్కిరి అయిన ప్రేక్షకులు

New Project (8)

New Project (8)

Pushpa 2 : అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల అయింది. నార్త్ ఇండియాలో ఈ సినిమా దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్‌ స్టార్‌ కు కూడా సాధ్యం కాని రీతిలో పుష్ప 2 సినిమా మొదటి రోజు వసూళ్లు సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమా మొదటి రోజు వసూళ్లను మరే సినిమా బ్రేక్ చేయలేదని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. కానీ పుష్ప రాజ్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి ఏకంగా షారుఖ్‌ ఖాన్‌కే సవాల్‌ విసిరాడు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప 2 క్రేజ్‌ను కొందరు బాలీవుడ్‌ జనాలు తట్టుకోలేకపోతున్నారు. బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం కొందరు తమ హీరోల ఆధిపత్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also:Pushpa 2 : పుష్ప ఓవర్సీస్ వసూళ్లు ఆల్ టైమ్ టాప్ – 3

కొందరు ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా బాహాటంగానే చెబుతున్నారు. పుష్ప 2 సినిమా హిందీ వర్షన్‌పై కొందరు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న టైంలో అనూహ్యంగా ముంబైలోని బాంద్రా గెలాక్సీ థియేటర్‌లో పెప్పర్‌ స్ప్రే ఎటాక్ తీవ్ర కలకలం రేపింది. ఇంటర్వెల్‌ బ్యాంగ్ కి ముందు గుర్తు తెలియని వ్యక్తి థియేటర్‌లో పెప్పర్‌ స్ప్రే ను చల్లడంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చాలా మంది దగ్గుతూ థియేటర్‌ బయటకు పరుగు తీశారు. దాంతో థియేటర్‌ నిర్వాహకులు దాదాపు 20 నిమిషాల పాటు సినిమాను నిలిపేశారు. లోపల ఉన్న పెప్పర్‌ ఘాటును తొలగించేందుకు ప్రయత్నించారు.

Read Also:KTR: తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ ను ఎవరో వచ్చి ఆహ్వానిస్తే ఎలా..

ఈ సంఘటనపై పోలీసులకు సైతం ఫిర్యాదు అందించినట్లు తెలుస్తోంది. థియేటర్‌ యాజమాన్యంతో పాటు కొందరు ప్రేక్షకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది. అనుమానం ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పెప్పర్‌ ఘాటుతో కొంత మంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కొంత సమయం తర్వాత అంతా నార్మల్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఏం కాలేదని థియేటర్‌ యాజమాన్యం ప్రకటించింది. పుష్ప 2 సినిమాపై అక్కసుతో ఇలా చేసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Show comments