Site icon NTV Telugu

Karnataka: ఉచిత బస్సు సర్వీసులతో ఆటోలు ఎక్కని జనాలు. మా పరిస్థితి ఏంటంటున్న ఆటో డ్రైవర్లు..!

Auto

Auto

Karnataka: ప్రభుత్వ పథకాలు కొందరికి మేలు చేసేలా ఉంటే.. మరికొందరికి నష్టాన్ని చేకూర్చులే ఉన్నాయి. అదే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అక్కడ ఆటో డ్రైవర్ల విషయంలో ఇదే జరుగుతోంది. నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఇచ్చిన హామీ మేరకు శక్తి యోజనను అమలు చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ కూడా వచ్చింది. మహిళలు తమ ప్రయాణాల కోసం ఉచిత బస్సు సర్వీసును అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్నారు.

Read Also: Nikhil Siddhartha: నన్ను డ్రగ్స్ తీసుకోమ్మని ఆఫర్ చేశారు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ బస్సులు దాదాపు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా.. బస్సుల్లో మహిళలకే ఫ్రీగా ఉండటంతో.. మగవారికి సీట్లు దొరకడం లేవు. మరోవైపు కర్ణాటకలో ఆటోవాలాల పరిస్థితి దీనంగా మారిపోయింది. ఆటోలో ఎక్కే జనాలు లేక డ్రైవర్లు.. రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా తమ ఆటోలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండంటంతో అందరు.. బస్సు ప్రయాణం వైపే మొగ్గు చూపుతున్నారని.. దాంతో సంపాదన ఆగిపోయిందంటూ ఆటో డ్రైవర్లు తెలుపుతున్నారు. రోజంతా ఒక్కరు కూడా ఆటో ఎక్కడం లేదని.. కనీసం రోజుకు రూ.100 కూడా సంపాదించని పరిస్థితి ఏర్పడిందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు.

Read Also: Tesla: ఇండియాకు రానున్న టెస్లా కారు.. రెడ్ కార్పెట్ పరుస్తున్న రాష్ట్రాలు

కర్ణాటకలో మినీ ముంబైగా పిలిచే హుబ్లీ నగరం నిత్యం రోడ్లపై రద్దీ ఉంటుంది. ఈ నగరం వాణిజ్యపరమైనది కావడంతో.. ప్రతిరోజు లక్షలాది మంది ఇక్కడికి షాపింగ్ కోసం వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ల సంపాదన బాగానే ఉండేది. అయితే ఇప్పుడు వారికి ఆదాయం లేదు.. దీంతో వారు రోడ్డెక్కారు. తమ దుస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. పని లేకుండా రోజు గడపడం కూడా కష్టంగా మారుతోందని.. గత 12 రోజులుగా ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కలేదని వాపోతున్నారు.

Read Also: Shabbir Ali: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి

హుబ్లీ ధార్వాడలో సుమారు 25 వేల ఆటోలు ఉన్నాయని.. రోజుకు 100 రూపాయల కూలీ పని చేయడం లేదని ఆటో డ్రైవర్లు అంటున్నారు. దీంతో కొందరు ఆటో డ్రైవర్లు తమ ఆటోలను అమ్ముకుని.. వేరే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ మఠపతి మండిపడ్డారు. ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే.. మృతదేహాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ ఎదుట పోరాటం చేస్తామన్నారు. హుబ్లీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. అందులో విషం బాటిల్ కావాలని ఏడుస్తూ అడిగాడు.

Exit mobile version