Japan Fish: జపాన్‌లోని బీచ్‌లో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు.. చూసి షాక్కు గురవుతున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్‌లోని హక్కైడో ప్రావిన్స్‌లోని హకోడేట్ తీరంలో శుక్రవారం ఉదయం వేల సంఖ్యలో చేపలు కొట్టుకురావడం కనిపించింది. ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలను చూసి స్థానిక ప్రజలు ఖంగుతిన్నారు. కాగా.. ఆ చేపలను తినవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. చనిపోయిన చేపలను ఇంటికి తీసుకురావద్దని స్థానిక యంత్రాంగం ప్రజలను అభ్యర్థించింది. ఎందుకంటే ఈ చేపలు విషం వల్ల చనిపోయాయని చెబుతున్నారు. కాగా.. చనిపోయిన ఈ చేపల వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు కనిపించడంతో స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.
Read Also: BSF: స్మగ్లర్లు LOC వెంబడి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ఓ వార్త నివేదిక ప్రకారం.. చనిపోయిన చేపలలో ప్రధానంగా సార్డినెస్, కొన్ని మాకేరెల్ ఉన్నాయి. చనిపోయిన చేపల కారణంగా సముద్రపు నీరు సుమారు కిలోమీటరు వరకు తెల్లగా కనిపిస్తుంది. నీటిపై దుప్పటి పరిచినట్లుగా చనిపోయిన చేపలు కనిపిస్తున్నాయి. హకోడేట్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు తకాషి ఫుజియోకా మాట్లాడుతూ.. ఈ చేపలను పెద్ద ప్రెడేటర్ వెంబడించి ఉండవచ్చు, అందువల్ల ఆక్సిజన్ లేకపోవడంతో అవి అలసిపోయి.. చివరికి చనిపోయి ఒడ్డుకు కొట్టుకువచ్చాయని తెలిపారు. అంతేకాకుండా.. ఈ చేపలను తినే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఈ చేపలు ఏ పరిస్థితుల్లో చనిపోయాయో తమకు ఖచ్చితంగా తెలియదని, అందుకోసం వాటిని తినమని సిఫారసు చేయనన్నారు.
Read Also: Saindhav: దృశ్యం కుటుంబాన్ని.. మళ్లీ చూసినట్టుంది వెంకీ మామ
ఇలాంటి ఘటనలు గతంలో జపాన్‌లో జరిగాయి. నివేదిక ప్రకారం.. గత సంవత్సరం జపాన్‌లో 5 సంవత్సరాల క్రితం హక్కైడోలోని వక్కనై నగరం సమీపంలో భారీ హిమపాతం తర్వాత కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సమయంలో కూడా.. చనిపోయిన చేపల మరణానికి కారణం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది.
【カメラマンから】戸井のイワシ、すごいことになっていました。後ほど道新デジタルにも動画をアップします(藤) pic.twitter.com/BqpArsiwUi
— たまて函@【公式】北海道新聞函館報道部 (@tamate_doshin) December 7, 2023
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!