Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pentagon Cyberattack: అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్‌కు చెందిన డేటాబేస్‌పై ఓ పెద్ద సైబర్ దాడి జరిగింది. సైనిక బలగాల సమాచారాన్ని భద్రపరిచే డిఫెన్స్ మ్యాన్‌పవర్ డేటా సెంటర్ (DMDC) సిస్టమ్‌లోకి సైబర్ నేరగాళ్లు అక్రమంగా చొరబడ్డారు. వీరు దాదాపు తొమ్మిది నెలల పాటు, అంటే 2025 అక్టోబర్ నుంచి 2026 జులై వరకు ఎవరికీ అనుమానం రాకుండా ఈ సిస్టమ్‌లో తిష్టవేశారు. ఈ డేటా లీక్ వల్ల ఏకంగా 27.6 లక్షల మంది ప్రాణాలతో ఉన్నవారితో పాటు, మరో 2.94 లక్షల మంది మరణించిన వారి వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కింది. అందులో ప్రజల పేర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు, పుట్టిన తేదీలు, కాంటాక్ట్ వివరాలు, వారు చేసే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే..? ఇంతటి కీలకమైన సమాచారం అసలు ఎన్‌క్రిప్ట్ చేయకుండా, ఎవరైనా సులభంగా చదివేలా ఉండటం వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ లోపాన్ని గమనించిన వెంటనే పెంటగాన్ అధికారులు సిస్టమ్‌ను ప్యాచ్ చేసి, సమాచారం బయటకు పొక్కకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని అధికారులు చెబుతున్నారు. బాధితులకు ఊరట కలిగించేలా ఓ ఏడాది పాటు ఉచితంగా క్రెడిట్ మానిటరింగ్, ఐడెంటిటీ ప్రొటెక్షన్ సేవలను అందిస్తున్నారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యానికి చెందిన సిస్టమ్‌లోనే ఇలాంటి భద్రతా లోపాలు బయటపడటం వారి సైబర్ సన్నాహాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ దాడి జరిగిన DMDC అనేది పెంటగాన్‌కు అత్యంత కీలకమైన పర్సనల్ రికార్డ్స్ నిధి. ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులు, రిజర్వ్ దళాలు, సివిలియన్ ఉద్యోగాలు చేసేవారు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ సిబ్బంది, పాత సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమాచారంతో కలిపి దాదాపు 6 కోట్లకు పైగా రికార్డులను ఈ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ లీక్‌లో కేవలం పేర్లు, ఫోన్ నంబర్లు మాత్రమే కాకుండా వారు ఏ హోదాలో, ఏ ఉద్యోగం చేస్తున్నారు అనే వివరాలు కూడా బయటకు రావడం జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా మారింది. ఎందుకంటే, దీని ఆధారంగా శత్రుదేశాలు లేదా హ్యాకర్లు అమెరికా సైనిక నిర్మాణం, వారి వ్యూహాత్మక పాత్రలను సులభంగా అంచనా వేసే అవకాశం ఉంది.
Also Read
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
ఈ సిస్టమ్‌లోకి ప్రవేశించిన హ్యాకర్ల సంఖ్య తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఏకంగా తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం పాటు వారికి ప్రాసెస్ దొరకడం చూస్తుంటే భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. 2026 జులైలో ఈ లోపాన్ని గుర్తించి వెంటనే సరిదిద్దారు. ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక నష్టం కానీ, డేటా దుర్వినియోగం కానీ జరగలేదని అధికారులు ఊరటనిస్తున్నా, ముప్పు మాత్రం పొంచి ఉందనేది నిపుణుల హెచ్చరిక. ఇలాంటి డేటా లీక్స్ వల్ల ఐడెంటిటీ థెఫ్ట్, ఫిషింగ్ దాడులు, దేశద్రోహ/గూఢచర్య కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉంది. సోషల్ సెక్యూరిటీ నంబర్, పుట్టిన తేదీలు చేతికి దొరికితే నకిలీ పత్రాలు సృష్టించడం హ్యాకర్లకు పెద్ద కష్టమేమీ కాదు. యాదృచ్ఛికంగా, అమెరికాలోని ప్రముఖ దర్యాప్తు సంస్థ FBI ఉద్యోగాల పోర్టల్‌లో కూడా ఇలాంటి సైబర్ దాడి వార్త వెలుగు చూసింది. అక్కడ ‘షినిహంజర్స్’ అనే హ్యాకింగ్ గ్రూప్ డేటాను లీక్ చేస్తామని బెదిరించినప్పటికీ, ఆ తర్వాత ఆ డేటాను బయటపెట్టడం లేదని ప్రకటించింది. ఈ రెండు సంఘటనలు అమెరికా ప్రభుత్వ డిజిటల్ భద్రతా వ్యవస్థల్లోని లోపాలను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి. ప్రస్తుతం పెంటగాన్ అధికారులు అసలు ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరు, వారి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనే కోణంలో తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!