NTV Telugu Site icon

Penna Cement: అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్‌.. ఏకంగా 10,422 కోట్లకు కొనుగోలు..

Penna Cement

Penna Cement

అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది. దింతో ఇకనుంచి అంబుజా సిమెంట్స్‌ కు 14 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దింతో.. అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఇది రెండవ అతిపెద్ద దేశీయ సిమెంట్ కంపెనీగా అవతరించనుంది.

Kannappa : భక్త కన్నప్ప కథ ఏంటి? వదిలిన టీజర్ ఏంటి? ఏమన్నా సింక్ ఉందా?

ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకలో మార్కెట్ వాటాను పెంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. పెన్నా సిమెంట్‌ కు శ్రీలంకలో అనుబంధ కంపెనీ ఉండడమే ఇందుకు కారణం. పెన్నా సిమెంట్‌ కు చెందిన సున్నపురాయి గనులు అంబుజా సిమెంట్స్‌ కు కూడా ఉన్నాయి. పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌లో 100% వాటాను కొనుగోలు చేసేందుకు కంపెనీ ప్రమోటర్ పి ప్రతాప్ రెడ్డి, అతని కుటుంబంతో అంగీకరించినట్లు అంబుజా సిమెంట్స్ గురువారం ప్రకటించింది.

Drinks For Thyroid Problems: థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆరు పానియాలు ట్రై చేయండి

తమ నిధులతో పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నామని అంబుజా సిమెంట్స్ సీఈవో అజయ్ కపూర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అంబుజా సిమెంట్స్ అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. తమ విస్తరణ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ కొనుగోళ్లు జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ గత ఆర్ధిక సంవత్సరం 2023-24లో రూ.1,241 కోట్ల టర్నోవర్‌ ను నమోదు చేసింది. పెన్నా సిమెంట్‌కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌ లలో సిమెంట్ యూనిట్లు ఉన్నాయి. పెన్నా సిమెంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 14 మిలియన్ టన్నుల సిమెంట్. కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్)లో 2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల యూనిట్, జోధ్‌పూర్ (రాజస్థాన్)లో 2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ యూనిట్లు వచ్చే సంవత్సరంలోగా ఉత్పత్తి చేయనున్నాయి.