NTV Telugu Site icon

MLA Kolusu Parthasarathy: మాజీ మంత్రి, ఆ వైసీపీ ఎమ్మెల్యే రూటు ఎటు..? సైకిల్‌ ఎక్కుతారా?

Parthasarathy

Parthasarathy

MLA Kolusu Parthasarathy: అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు జరుగుతోన్న వేళ.. కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి.. పార్టీకి గుగ్‌బై చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ఆయనతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చర్చలు జరిపినా.. ఆ ఎపిసోడ్‌ కొలిక్కిరాలేదు.. మరోసారి పార్థసారథితో చర్చలు జరిపారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి.. ఈ సారి 30 నిమిషాలు పాటు చర్చలు సాగాయి.. చర్చలు అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయావు అయోధ్య రామిరెడ్డి.. అయితే, మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు పార్థసారథి.. అయినా ఆయనలో అసంతృప్తి తగ్గినట్టుగా కనిపించడంలేదు.. వచ్చే ప్రభుత్వం కేబినెట్‌లో బెర్త్ పై హామీ కోసం పట్టు బడుతున్నట్లు సమాచారం.. సారథితో జరిపిన చర్చల సారాంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు అయోధ్య రామిరెడ్డి.. దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తోంది చూడాలి.. కానీ, పార్థసారథి టీడీపీలో చేరతారని విస్తృత ప్రచారం సాగుతోంది.

Read Also: Chocolates: చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు..

ఇక, పార్థసారథి ఇంటికి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వెళ్లి చర్చలు జరిపారు.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు.. పార్థసారథితో భేటీ అయ్యారు. దీంతో.. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌, మొండితోక అరుణ్‌కుమార్‌ కూడా అక్కడికి వెళ్లారు. చివరకు పార్థసారథి ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ఇంకా తెలియడంలేదు. అయితే, ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు పార్థసారథి.. ఇక, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌ విస్తరణలో పదవి ఆశించి భంగపడిన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లు ఎదురుచూసి.. తన ఆవేదనను బయటపెట్టారు. తాజా పరిణామాలతో సారథి.. పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు ఉన్నాయి.. ఈ మధ్య.. మీరు టీడీపీ చేరుతున్నారట కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే నవ్వుతూ వెళ్లిపోయారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మరి కొలుసు పార్థసారథి ప్రయాణం ఎటువైపో వేచిచూడాలి.

Show comments