NTV Telugu Site icon

Pemmasani: పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది..

Pemmasani

Pemmasani

టీడీపీ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన సర్వసభ్య సమావేశంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజాగళం యాత్ర నిర్వహణకు అబ్జర్వర్ గా విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆహ్వానం పలికారు. మరో 10 రోజులు అందరూ ఏకతాటిపైకి వచ్చి పని చేస్తే విజయం సాధిస్తామని ఆయన అన్నారు. పార్టీలో నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది.. ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవడం కష్టమైన పని ఏమి కాదని ఆయన చెప్పారు. కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం సఫలీకృతమయ్యే సమయం ఆసన్నం అయిందన్నారు. సాయంత్రం జరిగే ప్రజాగళం యాత్ర, భారీ బహిరంగ సభను సమిష్టిగా నడిపించి విజయవంతం చేద్దామన్నారు.

Read Also: Bomb Threat : నిన్న ట్వీట్.. నేడు పాఠశాలల్లో బాంబులు.. బీజేపీ నాయకుడి పోస్ట్‌పై ఆప్ ప్రశ్నలు

కాగా, దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజాగళం యాత్రకు టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రచార కార్యక్రమాల నుంచే ప్రజల్లో అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ అని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్న రాజధాని ప్రాంతానికి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం సాధారణ విషయం కాదు.. అలాంటి వ్యక్తిని చంద్రబాబు ఏరి కోరి ఎన్నిక చేశారని దేవినేని ఉమ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తుని చిట్టిబాబు, టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. అలాగే, తెనాలిలో జరగిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి గుంటూరు పార్లమెంట్ ఎన్డీయే కూటమి అభ్యర్థిపెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.