Peddireddy Ramachandra Reddy: నల్లారి బ్రదర్స్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అన్నమయ్య జిల్లా పీలేరులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో.. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్ఏ చింతల రామచంద్రారెడ్డితో కలిసి పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. సూటు కేసుతో వచ్చారు, తిరిగి వచ్చే నెల 14వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లిపోతారని ఆరోపించారు.
Read Also: Uttarpradesh : 200అడుగుల లోతులో పడిన కారు.. నలుగురు మృతి
ఇక, కరోనా సమయంలో ఇటు ప్రక్క కన్నెత్తి కూడా చూడలేని ఇద్దరు నాయకులు, ఇప్పుడు ఏ ముఖం ఎత్తుకుని నియోజక వర్గంలో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి. ఒకప్పుడు ఎర్ర చందనం స్మగ్లర్ అని కిషోర్ కుమార్ రెడ్డిని చంద్రబాబు పీలేరు బహిరంగ సభలో చెప్పాడని.. కానీ, అదే స్మగ్లర్ కు ఇప్పుడు సీట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడని విమర్శించారు. ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బందికి గురి చేయండి అని చెప్పి.. ముఖ్యమంత్రి సీటు తీసుకున్నారు అంటూ.. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగగా.. పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం విదితమే.