NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. రేపు కూడా రాబోతున్నాం

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Reddy: మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. రేపు కూడా అధికారంలోకి రాబోతున్నాం అని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కలిసిమెలిసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.. అయితే, ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాలి.. కావున అందరూ కష్టపడి పనిచేయాలి.. వైసీపీ అభ్యర్థులు అంతా విజయం సాధించేలా పనిచేయాలని కోరారు.. మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, మళ్లీ ఓటు అడిగే విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ చేశారు. ఇప్పుడు అభ్యర్థులు ఖారారయ్యారు కాబట్టి.. అందరినీ కలుపుకొని నేతలు ముందుకు పోవాలని సూచించారు.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి.. ఈ బాధ్యత మన అందరిపై ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read Also: Kishan Reddy: సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మోడీనే..!