Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Ticket Price Hike: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. తెలంగాణాలో టికెట్ ధరల పెంపు వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సినిమా విడుదల సందర్భంగా వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ‘పెద్ది’ సినిమా యూనిట్.. చివరకు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని చిత్ర యూనిట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు హోం సెక్రటరీకి రెండు సార్లు వినతిపత్రాలు కూడా సమర్పించినట్లు కోర్టుకు తెలిపింది. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
Also Read
కానీ టికెట్ ధరల పెంపు వ్యవహారంపై గతంలో ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకున్న హైకోర్టు.. ఈ విషయంలో ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో పరిస్థితిని అంచనా వేసుకున్న ‘పెద్ది’ సినిమా యూనిట్.. తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణాలో ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరలు పెరిగే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి చివరి నిమిషంలో ఏమైనా ప్రత్యేక అనుమతులు వస్తాయా లేదా అన్నది చూడాలి. రామ్ చరణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!