సమ్మర్ అంటేనే పెద్ద సినిమాల సీజన్. అయితే ఈ ఏడాది మే నెలలో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. పెద్ది రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రం ముందుగా ఏప్రిల్ 30న రావాలి. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు మరియు షూటింగ్ ఇంకా కొంత మిగిలి ఉండటంతో ఈ సినిమా జూన్ నెలకు వాయిదా వేయడంతో ఆ డేట్ కోసం క్యూ కట్టాయి.
స్వయంభు : నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. సోలోగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు ఏప్రిల్ 30నే ఫిక్స్ అయ్యి ఉంది. అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
మా ఇంటి బంగారం : సమంత రూత్ ప్రభు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చేస్తున్న పవర్‌ఫుల్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా మే 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ సమీకరణాలను బట్టి మే 1కే ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్.
గాయపడ్డ సింహం : తరుణ్ భాస్కర్ హీరోగా, దిల్‌రాజు నిర్మాణంలో వస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మే 1న విడుదలకు కన్ఫర్మ్ అయ్యింది. ఒకవేళ ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల అయితే, దీనిని ఒక వారం వాయిదా వేస్తామని మేకర్స్ ముందే ప్రకటించారు.
ఎపిక్ : బేబి వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎపిక్’. వీరిద్దరి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను మే 1న విడుదల చేసేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేస్తోంది.
