Exclusive : ‘పెద్ది’ డేట్ కోసం టాలీవుడ్ లో భారీ క్యూ.. రేసులో ఎవరెవరు ఉన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్ అంటేనే పెద్ద సినిమాల సీజన్. అయితే ఈ ఏడాది మే నెలలో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. పెద్ది రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రం ముందుగా ఏప్రిల్ 30న రావాలి. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు మరియు షూటింగ్ ఇంకా కొంత మిగిలి ఉండటంతో ఈ సినిమా జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్టు వార్తలు వస్తుండడంతో ఆ డేట్ కోసం క్యూ కట్టాయి.
స్వయంభు : నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియడ్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. సోలోగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు ఏప్రిల్ 30నే ఫిక్స్ అయ్యి ఉంది. అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
మా ఇంటి బంగారం : సమంత రూత్ ప్రభు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చేస్తున్న పవర్ఫుల్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా మే 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ సమీకరణాలను బట్టి మే 1కే ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్.
గాయపడ్డ సింహం : తరుణ్ భాస్కర్ హీరోగా, దిల్‌రాజు నిర్మాణంలో వస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మే 1న విడుదలకు కన్ఫర్మ్ అయ్యింది. ఒకవేళ ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల అయితే, దీనిని ఒక వారం వాయిదా వేస్తామని మేకర్స్ ముందే ప్రకటించారు.
ఎపిక్ : బేబి వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎపిక్’. వీరిద్దరి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను మే 1న విడుదల చేసేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!