రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ అలాగే కీలక పాత్రల గురించి కొన్ని క్రేజీ రూమర్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నారని, ఆమె పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్‌లోనే వచ్చినప్పటికీ కథను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. ఇక అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. సినిమా క్లైమాక్స్‌లో ఒక భారీ ప్రమాదం కారణంగా హీరో రెండు కాళ్లు కోల్పోతాడని, అయినప్పటికీ పట్టుదలతో రన్నింగ్ రేసులో పాల్గొని ఛాంపియన్‌గా నిలుస్తాడని తెలుస్తోంది. ఈ ఎమోషనల్ పాయింట్ సినిమాకే హైలైట్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Also Read:Sara Arjun : విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకున్న ‘ధురంధర్’ భామ..
ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ‘పెద్ది’ చాలా రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందని చిత్ర వర్గాల టాక్. బుచ్చిబాబు రాసిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తూండటం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్‌గా కూడా ఒక వండర్‌లా ఉండబోతోందట. ఇక ఈ రూమరే కనుక నిజం అయితే ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తి ప్రపంచ విజేతగా ఎలా నిలిచాడనే స్ఫూర్తిదాయక కథతో చరణ్ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
