Gossip: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ‘ఓజి’ (OG) సినిమా వైబ్ ఇంకా అభిమానుల కళ్ల ముందు తిరుగుతుండగానే.. “బాస్ ఇస్ బ్యాక్” అంటూ మెగాస్టార్ చిరు కూడా మన శంకరవరప్రసాద్ గారితో రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా అంటూ ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
RRB Group D: రైల్వేలో 22,000 గ్రూప్ డి పోస్టులు.. కొత్త అప్లికేషన్ డేట్ ఇదే
గ్లిమ్స్ టీజర్‌కు వచ్చిన స్పందన, ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్ సృష్టించిన సెన్సేషన్ చూస్తే ‘పెద్ది’ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ పాట యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ దాటడం సినిమాకు మరింత బజ్ తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘పెద్ది’కు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారనే టాక్ హల్చల్ చేస్తోంది. క్లైమాక్స్ సమయంలో వచ్చే స్పెషల్ క్యామియోలో పవన్ ఎంట్రీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్యామియో రోల్ పూర్తిగా కథను మలుపు తిప్పేలా ఉంటుందని, ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌తో లింక్ అయి ఉండే పవర్ఫుల్ సీన్‌గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే… ఈ స్పెషల్ సీన్ ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో ఉండబోతుందని టాక్. పవన్ కళ్యాణ్ విజయనగరం–విశాఖ స్టైల్ స్లాంగ్‌లో రఫ్ అండ్ ఇంటెన్స్ డైలాగ్స్ చెప్పబోతున్నారంటూ టాక్. ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో పవన్ కనిపించిన ప్రతీ సినిమా ప్రేక్షకులను అలరించిందే. అలాంటి పవర్ స్టార్, రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేస్తే థియేటర్లు ఊగిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సీన్ రూరల్ వైబ్‌ను మరింత బూస్ట్ చేస్తూ, క్లైమాక్స్‌కు అదిరిపోయే ఎలివేషన్ ఇస్తుందని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే, ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్‌పై డబుల్ బ్లాస్ట్ ఖాయమనే చెప్పాలి.
మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ‘పెద్ది’ విడుదల కానుండగా.. ఈ పవర్ ప్యాక్ కాంబినేషన్ నిజమైతే మెగా–పవర్ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇవన్నీ ఇండస్ట్రీ టాక్ మాత్రమే. అధికారిక ప్రకటన వస్తే మాత్రం ‘పెద్ది’ క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం.
