NTV Telugu Site icon

Benefits of Peanuts: వేరుశెనగల వలన ఎన్నో లాభాలు.. ఇవి తెలిస్తే రోజూ తింటారు!

Peanuts

Peanuts

Top Peanuts Health Benefits: పప్పు ధాన్యాలకి చెందిన ‘వేరుశెనగ’ (పల్లీలు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. చలికాలంలో వేడి వేడి వేరుశెనగలు తింటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. చట్నీ చేసుకుని తిననిదే కొంత మందికి అల్ఫాహారం పూర్తికాదు. చిన్న పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. వేరుశెనగలు రుచిగా ఉండడమే కాదు.. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. వేరుశెనగలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా.. శరీరంలోని అనవసరమైన వ్యాధులను నివారిస్తాయి.

పీచు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే వేరుశెనగ ఆరోగ్యానికి నిధి అని అంటారు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత అందరూ డ్రై ఫ్రూట్స్ తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్ చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. అవి సామాన్యులకు అందుబాటు ధరలో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో చౌకగా లభించే వేరుశనగ అనేక డ్రై ఫ్రూట్స్‌ను కవర్ చేస్తుంది. అందుకే వేరుశనగను ‘పేదల జీడిపప్పు’ అని కూడా అంటారు. పల్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

స్థూలకాయం:
వేరుశెనగ తీసుకోవడం వల్ల చాలా వ్యాధులు దూరంగా ఉంటాయి. స్థూలకాయంతో బాధపడుతున్నా, పదే పదే ఆకలితో ఉన్నట్లయితే వేరుశెనగ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పల్లీలు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. దాంతో ఊబకాయం తగ్గుతుంది.

Also Read: Hepatitis Warning Sign: హెపటైటిస్ వ్యాధి ఎయిడ్స్‌ కంటే ప్రమాదమైంది.. సంకేతాలు ఇవే!

మధుమేహం:
మధుమేహం లక్షణాలు కనిపిస్తే.. వేరుశెనగ తీసుకోవడం ప్రారంభించండి. పల్లీలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడుతాయి.

క్యాన్సర్‌:
వేరుశెనగలో ఉండే పాలీఫెనోలిక్ యాంటీ-ఆక్సిడెంట్ల లక్షణాలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. కాబట్టి పల్లీలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

చర్మం:
వేరుశెనగలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు తీసి ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది. వేరుశెనగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. వేరుశెనగ తీసుకోవడం వల్ల జీవక్రియ బాగా పనిచేస్తుంది.

Also Read: iPhone 15 Launch Date: యాపిల్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఐఫోన్ 15 విడుదల ఆ రోజే!

Show comments