Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌగోళికంగా విడిపోయినా.. మనుషులుగా కలిసి ఉన్నామన్నారు.. బంధుత్వాలు, స్నేహలు ఆంధ్ర, తెలంగాణ మధ్య అలాగే ఉన్నాయని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలుగు వారంతా కలిసి ఉండాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటై ఆర్డినెన్స్ అడ్డుకున్నాయని, కచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అంటున్నారు. చీకటి తర్వాత వెలుగు ఉన్నట్లుగా ఏపీ కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని వ్యాఖ్యానించారు. రాత్రి పగలు రెండు ఉంటాయని అన్నారు. సముద్ర తీరంలో ఉన్న విశాఖ భవిష్యత్తులో మహానగరంగా అభివృద్ధి చెందుతుందని, ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ పీసీసీ ఛీప్ మహేష్ కుమార్ గౌడ్..
Read Also: Mithramandali : అలాంటి వాళ్లంతా పిచ్చోళ్లే.. బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్
