NTV Telugu Site icon

Gidugu Rudra Raju: ‘వై నాట్ కాంగ్రెస్’ నినాదంతో ప్రజల్లోకి

Gidugu Rudra Raju

Gidugu Rudra Raju

Gidugu Rudra Raju: వై నాట్ కాంగ్రెస్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లోకి వెళ్లబోతున్నాం అని తెలిపారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరుగుతోన్న విషయం విదితమే కాగా.. ఈ సమావేశానికి క్రిస్టఫర్, మయప్పన్, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి, పల్లం రాజు, జేడీ శీలం, తులసి రెడ్డి, చింతా మోహన్, కె.రాజు సహా తదితర నేతలు పాల్గొన్నారు.. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై కీలకంగా చర్చ సాగిస్తున్నారు.

Read Also: Rohit Sharma: కోలుకోలేకపోయా అంటూ.. ప్రపంచకప్‌ ఫైనల్ ఓటమిపై తొలిసారి స్పందించిన రోహిత్!

ఈ సందర్భంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. విధానపరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నాం అన్నారు. రానున్న రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపర్చాలి అనే వాటిపైనా సమాలోచనలు చేస్తున్నాం అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు వెల్లడించారు. దీని కోసం వై నాట్ కాంగ్రెస్ అనే నినాదంతో ఏపీ ప్రజల్లోకి వెళ్లబోతున్నాం అని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై వంద రోజుల క్యాంపెయిన్ నిర్వహించబోతున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు కర్ణాటక, తెలంగాణ లీడర్ల కూడా ఆంధ్రప్రదేశ్‌కి వస్తారని తెలిపారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.