PBKS vs DC: దాడి జరిగిందని స్టార్క్ చెప్పాడు.. డుప్లెసిస్ షూ కూడా వేసుకోలేదు: అలీసా హీలీ
- పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు
- 60 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగిందని స్టార్క్ చెప్పాడు
- ఫాఫ్ డుప్లెసిస్ షూ కూడా వేసుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ 2025 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఫ్లడ్‌లైట్ల సమస్య వల్లే మ్యాచ్ ఆగిందని ముందుగా అందరూ అనుకున్నా.. సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది. ఈ మ్యాచ్ జరుగుతున్నపుడు ధర్మశాల స్టేడియంలోనే ఉన్న ఆస్ట్రేలియా మహిళలా టీమ్ కెప్టెన్, మిచెల్ స్టార్క్ సతీమణి అలీసా హీలీ.. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. స్టేడియంకు 60 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగిందని స్టార్క్ తనకు చెప్పాడని, ఆ సమయంలో తాను బయపడిపోయా అని అలీసా తాజాగా తెలిపారు.
‘విల్లోటాక్’ పాడ్‌కాస్ట్‌లో అలీసా హీలీ మాట్లాడుతూ… ‘మైదానంలో రెండు ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. మ్యాచ్ మళ్లీ మొదలవుతుందని మేము ఎదురుచూస్తున్నాం. మాకు దగ్గర్లో కూర్చున్న వారు స్టేడియాన్ని ఖాళీ చేయించబోతున్నట్లు మాట్లాడుకుంటుంటున్నారు. మా పక్కన, మిగతా ప్లేయర్స్ కుటుంబ సభ్యులు, అదనపు సహాయక సిబ్బంది ఉన్నారు. కాసేపటికి మా బృందంలో ఓ వ్యక్తి వచ్చి స్టేడియం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పాడు. అతడు కాస్త కంగారుగా కనిపించాడు. జనాలు హడావుడిగా పైకి, కిందికి తిరగడం చూశాం. కొందరు మైదానం వీడడాన్ని చూసి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అప్పుడు కాస్త కంగారు మొదలైంది’ అని చెప్పారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Ramagiri MPP Election: ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ!
‘ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మా బృందంలో ఉన్న ఒక చిన్నారిని ఎత్తుకుని.. మనం వెంటనే బయల్దేరాలన్నాడు. అంతలో ప్లేయర్స్ కూడా మా వద్దకు వచ్చారు. వారి ముఖాల్లో టెన్షన్ కనిపించింది. ఫాఫ్ డుప్లెసిస్ అయితే షూలు కూడా వేసుకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిచెల్ స్టార్క్‌ను ఏమైందని నేను అడిగాను. మైదానంకు 60 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగిందని, అందుకే ఇక్కడ పూర్తిగా విద్యుత్తు ఆపేశారని చెప్పాడు. ఆ సమయంలో నేను బయపడిపోయా. వెంటనే మేం వ్యాన్లలో హోటల్‌కు వెళ్లిపోయాం. అక్కడ పరిస్థితి అంత బాగా లేదు. అనంతరం మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లారు’ అని అలీసా హీలీ తెలిపారు. మధ్యలో ఆగిన మ్యాచ్ మే 24న మళ్ళీ జరుగుతుంది. ఈసారి ధర్మశాలలో కాకుండా.. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!