PBKS vs CSK: టాప్ లేపిన పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై..!
- చెన్నై సూపర్ కింగ్స్‌కు చెపాక్‌లో వరుసగా ఆరో ఓటమి
- పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం
- ముందుగా బ్యాటింగ్ చేసిన CSK 209 పరుగులు నమోదు
- శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (50)తో విజయం ఖాయం
- పంజాబ్ పాయింట్స్ టేబుల్లో టాప్కు చేరుకోగా..
- చివరి స్థానానికి CSK..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PBKS vs CSK: ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కష్టాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సొంత గడ్డపై చెన్నైకి ఇది వరుసగా ఆరో ఓటమి. దీనితో చెన్నై అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు. గత సీజన్లో ఐదు హోమ్ మ్యాచ్ లలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ ఏడాది కూడా అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ ఇంకా విజయాల ఖాతాను ఇంకా తెరవలేదు.
Saturday Horoscope: శనివారం రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిందే..!
Also Read
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ఇక CSK vs PBKS మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఆదిలోనే చుక్కెదురైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ పవర్‌ప్లేలో పరుగులు తీయడానికి ఇబ్బంది పడటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే 18 ఏళ్ల యువ సంచలనం ఆయుష్ మ్హాత్రే క్రీజులోకి రావడంతో ఆట స్వరూపమే మారిపోయింది. మ్హాత్రే కేవలం 43 బంతుల్లో 73 పరుగులతో రెచ్చిపోవడంతో జట్టుకు 200+ స్కోరు అందించాడు. అతనికి తోడుగా చివరిలో శివమ్ దూబే (45), సర్ఫరాజ్ ఖాన్ (32) మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాక్ రెండు వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్ పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నైని కట్టడి చేశాడు.
ఇక భారీ బాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీనితో పంజాబ్ కేవలం 3.2 ఓవర్లలోనే 50 పరుగులతో ఫ్లయింగ్ స్టార్ట్ ను అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో సిఎస్‌కెపై నమోదైన వేగవంతమైన ఫిఫ్టీ ఇదే కావడం విశేషం. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 43 పరుగులు, కూపర్ కానలీ 36 పరుగులతో రాణించారు.
Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
ఇక మిడిల్ ఓవర్లలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ తో విజయాన్ని ఖాయం చేశాడు. అయ్యర్ 17వ ఓవర్లో అవుట్ అయినప్పటికీ, చివర్లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో పంజాబ్ ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లగా, చెన్నై మాత్రం వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేయుకుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!