Site icon NTV Telugu

Payyavula Keshav: బస్సు ప్రమాదంపై కూడా శవరాజకీయాలు చేయడం బాధాకరం!

Payyavula Keshav

Payyavula Keshav

కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం బాధాకరం అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారన్నారు. బస్సు ప్రమాదంపై కూడా కొన్ని చానళ్లు శవరాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. పింక్ డైమండ్, నారా రక్త చరిత్ర, మామిడి కాయల స్టోరీ.. ఇలా ఫేక్ రాజకీయాలు చేయడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ దిట్ట అని మంత్రి పయ్యావుల విమర్శించారు.

Also Read: AP Weather Alert: 4 రోజులు అతి భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండండని హోంమంత్రి సూచన!

‘ఏపీకి గూగుల్ సంస్థ రావడంతో ప్రపంచం నెవ్వరపోతోంది. గూగుల్ నేను తీసుకొచ్చానని వైఎస్ జగన్ చెబుతున్నాడు. జగన్ తీసుకొచ్చినవి భుంభుo బీర్, ప్రెసిడెన్టీ మెడల్. దేశంలో లేని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. కోడి గుడ్డు, అల్లం పరిశ్రమలను తీసుకొచ్చే ఐటీ మినిస్టర్‌ను పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అక్రమ మద్యంతో సంబంధం ఉన్నవాళ్ళును ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాం. స్పిరిట్‌తో తయారయ్యే మద్యం కాదని ఎక్స్ట్రా న్యూట్రాన్ ఆల్కహాల్ ను దేశంలో తీసుకొచ్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు. వైసీపీ హాయంలో సరఫరా అయిన మద్యంలో ప్రాణానికి హానికరమైన రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇవాళ కల్తీ మద్యంలో కుంభకోణంలో ఉన్నవారంతా ఏమవుతున్నారు అందరికీ తెలుసు. కల్తీ మద్యం నివారించడానికి క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం. వైసీపీ హయాంలో కల్తీ మద్యంతో జంగారెడ్డి గూడెంలో ఎంతమంది చనిపోయారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అందుకని చర్యలు తీసుకుంటున్నాం. పక్కనోడిపై బట్ట కాల్చి వెళ్ళిపోవడం జగన్ నైజం’ అని మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు.

Exit mobile version