NTV Telugu Site icon

Paytm stocks: 11 శాతం పెరిగిన పేటియం స్టాక్.. ఈ సారి పెరుగుదలకు కారణం వేరే

Paytm

Paytm

Paytm stocks: ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ పేటీఎంను నిర్వహిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు సోమవారం 11 శాతం వరకు పెరిగాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ తరపున Antfin (నెదర్లాండ్స్) కలిగి ఉన్న Paytm లో 10.30 శాతం వాటాను కొనుగోలు చేయడం షేర్ విలువ పెరిగేందుకు కారణం. ఇది ఆఫ్ మార్కెట్ బదిలీ, నగదు రహిత ఒప్పందం.

Read Also:OnePlus 10 Pro 5G Price: అమెజాన్‌‌లో బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 17 వేల తగ్గింపు!

Paytm స్టాక్‌లో ట్రేడింగ్
ఈ వార్త తెలియగానే NSEలో Paytm షేర్లు 11.43 శాతం పెరిగి 887.70 వద్ద ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో బీఎస్ఈలో 11.57 శాతం లాభంతో రూ.887.55 వద్ద షేరు ప్రారంభమైంది. అయితే, స్టాక్ తన లాభాలను కొనసాగించలేకపోయింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 6.54 శాతం పెరిగి 848.70 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటివరకు ట్రేడింగ్‌లో ఈ షేరు గరిష్టంగా 887.70, కనిష్ట స్థాయి 844.55కి చేరుకుంది.

Read Also:Medico Student Missing: సంగారెడ్డిలో పీజీ మెడికల్ స్టూడెంట్ మిస్సింగ్.. తండ్రికి వాట్సాప్ లో సూసైడ్ నోట్

ఒప్పందం ఏమిటి?
ఈ ఒప్పందం ప్రకారం శర్మ యాంట్‌ఫిన్ వద్ద ఉన్న 10.3 శాతం వాటాను కొనుగోలు చేస్తారు. ప్రతిగా OCDలను యాంట్‌ఫిన్‌కు కంపెనీ జారీ చేస్తుంది. అయినప్పటికీ యాంట్‌ఫిన్ ఇప్పటికీ ఆర్థిక హక్కులను కలిగి ఉంటుంది. కంపెనీ బిఎస్‌ఇకి ఇచ్చిన సమాచారంలో ఈ కొనుగోలుకు నగదు రూపంలో చెల్లించబడదని, కంపెనీ ఎటువంటి హామీ, తనఖా లేదా మరే ఇతర వాగ్దానం చేయలేదని వెల్లడించింది. నిర్వహణపై ఈ ఒప్పందం ప్రభావం ఉండదు. విజయ్ శేఖర్ శర్మ కంపెనీ MD & CEO గా కొనసాగుతారు. కంపెనీ బోర్డులో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే యాంట్‌ఫిన్ నామినీలు ఎవరూ కంపెనీ బోర్డులో ఉండరు. యాంట్‌ఫిన్ అనేది చైనీస్ కంపెనీ యాంట్ గ్రూప్ కంపెనీకి అనుబంధ సంస్థ.