NTV Telugu Site icon

Paytm : పేటీఎం మాస్టర్ ప్లాన్.. తన పార్టనర్ గా రంగంలోకి ఎస్బీఐ

Paytm

Paytm

Paytm : సమస్యల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఫిన్‌టెక్ కంపెనీ Paytm ఎట్టకేలకు మార్చి 15 గడువు కంటే ముందే తన పార్టనర్ బ్యాంకును ఎంపిక చేసుకుంది. Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో చేతులు కలిపింది. ఇప్పటి వరకు Paytm UPI వ్యాపారం దాని అనుబంధ సంస్థ Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై ఆధారపడి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెల్లింపుల బ్యాంకులపై వ్యాపార నిషేధం విధించిన తర్వాత Paytm పార్టనర్ బ్యాంకు కోసం వెతుకుతోంది. ఇప్పుడు Paytm SBI సహకారంతో థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ (TPAP)గా మారనుంది.

ఇంతకుముందు Paytm TPAP భాగస్వామ్యం కోసం యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, HDFC బ్యాంక్‌లతో చేతులు కలిపింది. ఒకరోజు క్రితం విడుదల చేసిన నివేదికలో.. ఇదే బ్యాంకులు Paytmతో టై-అప్ చేయడంలో ముందంజలో ఉన్నాయని పేర్కొంది. గత నెలలో వన్ 97 కమ్యూనికేషన్స్ (OCL) తన నోడల్ లేదా ఎస్క్రో ఖాతాను యాక్సిస్ బ్యాంక్‌కు అప్పగించింది. ఈ సమాచారాన్ని కంపెనీ బిఎస్‌ఇకి కూడా అందజేసింది. దీని సహాయంతో Paytm ద్వారా డిజిటల్ పేమెంట్స్ ను అంగీకరించే వ్యాపారులు గడువు మార్చి 15 తర్వాత కూడా ఆపరేట్ చేయగలరు.

Read Also:Jeethu Joseph : వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న జీతూ జోసెఫ్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కూడా మార్చి 15 నాటికి Paytmకి TPAP లైసెన్స్ మంజూరు చేస్తుందని భావిస్తున్నారు. ఈ లైసెన్స్ పొందిన తర్వాత, వినియోగదారులు Paytm UPIని సులభంగా ఉపయోగించగలరు. మార్చి 15 తర్వాత Paytm పేమెంట్స్ బ్యాంక్ తన కార్యకలాపాలను మూసివేయవలసి ఉంటుంది. గడువు ముగిసేలోపు Paytm చేతిలో TPAP లైసెన్స్ ఉంటుంది. అయితే బ్యాంకులతో ఏకీకరణకు ఒక నెల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.

TPAP NPCI, పార్టనర్ బ్యాంకుల మార్గదర్శకాలను అనుసరించాలి. అలాగే, UPI లావాదేవీలకు సంబంధించి డేటా, సమాచారం, సిస్టమ్ సమాచారాన్ని RBI, NPCIతో పంచుకోవాలి. ప్రస్తుతం Amazon Pay, Google Pay, MobiKwik, WhatsApp సహా 22 కంపెనీలు దేశంలో TPAP లైసెన్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ UPI ప్లేయర్‌లలో చాలా వరకు యాక్సిస్ బ్యాంక్ భాగస్వామి. Paytm దేశంలో మూడవ అతిపెద్ద UPI చెల్లింపుల యాప్. ఫిబ్రవరిలో కంపెనీ సుమారు రూ. 1.65 లక్షల కోట్ల విలువైన 1.41 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. PhonePe, Google Pay UPI చెల్లింపు విభాగంలో రెండు అతిపెద్ద ప్లేయర్‌లు.

Read Also:Jamili Elections: నేడు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి నివేదిక..