Jeethu Joseph : వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న జీతూ జోసెఫ్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ మీనా ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించనుంది.జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం, దృశ్యం -2 సినిమాల్లో మీనా హీరోయిన్‌గా కనిపించింది.తన కూతుళ్లను కాపాడుకోవడానికి ఆరాటపడే సగటు మధ్య తరగతి తల్లిగా రియలిస్టిక్ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. దృశ్యం ఒరిజినల్ మలయాళం వెర్షన్‌తో పాటు తెలుగు రీమేక్‌లోనూ మీనానే లీడ్ రోల్‌లో కనిపించింది.తాజాగా జీతూ జోసెఫ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. అయితే ఈ సిరీస్‌కు జీతూ జోసెఫ్ డైరెక్టర్‌గా కాకుండా షో రన్నర్‌గా మరియు ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు రోస్లిన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ వెబ్‌సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వినాయక్ శశికుమార్ కథను అందిస్తున్నారు. ఇందులో మీనాతో పాటు ప్రేమదేశం ఫేమ్ వినీత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంజనా దీపు మరియు హకీమ్ షా కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.జీతూ జోసెఫ్ సినిమాల తరహాలోనే ఊహలకు అందని ట్విస్ట్‌లు టర్న్‌లతో రోస్లిన్ వెబ్‌సిరీస్ సాగనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ టైటిల్‌కు సీక్రెట్ స్టోరీస్ అనే క్యాప్షన్ ను పెట్టారు.. ఇటీవల ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ కన్నుపై అమ్మాయి నిల్చొని ఉన్నట్లుగా పోస్టర్‌ను వెరైటీగా డిజైన్ చేశారు. పోస్టర్‌లో ఓ పాతకాలం నాటి బిల్డింగ్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.రోస్లిన్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ మలయాళం వెబ్‌సిరీస్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్నట్లు సమాచారం. జూన్ లేదా జూలై నుంచి హాట్‌స్టార్‌లో రోస్లిన్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Also Read
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?