పాయల్ రాజ్ పుత్..తెలుగులో ఈ భామ ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది.. ఆ సినిమా తరువాత తెలుగులో డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్‌మార్‌ఖాన్ మరియు జిన్నాతో పాటు తెలుగులో చాలా సినిమా లు చేసింది పాయల్ రాజ్‌పుత్. కానీ ఆ సినిమాలన్నీఅంతగా ఆకట్టుకోలేకపోయాయి ఇండస్ట్రీలో తనకు గైడెన్స్ ఇచ్చేవారు ఎవరూ లేరని, అందువల్లే ఆర్ఎక్స్ 100 తర్వాత సినిమాల ఎంపికలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తనకు సరైన విజయాలు దక్కకపోవడానికి అది కూడా ఓ కారణమని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. సినిమా కథ అందులోని పాత్ర తన మనసుకు నచ్చితేనే సినిమాను అంగీకరించాలని ఫిక్స్ అయినట్లు ఆమె తెలిపింది.ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం.. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పైనే పాయల్ రాజ్‌పుత్ బోలెడు ఆశలు పెట్టుకున్నది. కాగా మంగళవారం సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఈ భామ ఎంట్రీ ఇస్తోంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ నవంబర్ 17న రిలీజ్ కాబోతోంది.మంగళవారం సినిమాలో బోల్డ్ డీ గ్లామర్ లుక్‌లో పాయల్ రాజ్‌పుత్ కనిపించబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న పాయల్ రాజ్‌పుత్ వెంకీ మామ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.తన సినీ కెరీర్‌లో వెంకీ మామ మూవీ ఓ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిందని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చెప్పింది.వెంకీ మామలో తన వయసుకు మించిన పాత్రను చేశానని, ఆ సినిమాలో తన లుక్ అసలు బాగోదని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కావడంతో క్యారెక్టర్ నచ్చకపోయినా కూడా సినిమా చేశానని చెప్పింది.ఆ సినిమాలో నటించినందుకు రిగ్రేట్‌గా ఫీలయ్యానని, వెంకీ మామ ఓ అనుభవ పాఠంగా తన కెరీర్‌లో నిలిచిపోయిందని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.. అయితే వెంకీ మామ సినిమాలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించారు. బాబీ దర్శకత్వంలో 2019 లో విడుదలయిన ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది..
