పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది..ఆర్ఎక్స్ 100 చిత్రంలో హాట్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ రచ్చ రచ్చ చేసింది.తొలి సినిమాలోనే బోల్డ్ గా నటించింది. ఆ సినిమాతో ఊహించని క్రేజ్ ను సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది.పాయల్ కు వచ్చిన ఆ క్రేజ్ ని సరిగ్గా వాడుకోలేకపోయింది.. సరైన కథలు ఎంపిక చేసుకోవడం లో కాస్త తడబడింది.ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ వంటి పెద్ద చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు అంతగా గుర్తింపు లభించలేదు.మంచు విష్ణు సరసన జిన్నా అనే క్రేజీ మూవీలో కూడా నటించింది..ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు..తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ ఎదురు చూస్తుంది.
ప్రస్తుతం పాయల్ నటిస్తున్న మూవీ మంగళవారం. తనకు ఆర్ఎక్స్ 100 వంటి భారీ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో పాయల్ మరోసారి బోల్డ్ గా కనిపించింది.. సినిమాలో ఆమె టాప్ లెస్ లుక్ తెగ వైరల్ అయ్యింది. రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ సస్పెన్సు, హారర్ అంశాలతో ఆసక్తి కలిగించింది.. అయితే చిత్ర కథ ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. మంగళవారం సినిమాతో పాయల్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఈ భామ తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది.ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ లండన్ లో ఉన్నట్లు సమాచారం.కొన్నాళ్లుగా ఆమె అక్కడే ఉంటూ అక్కడి అందాలను ఆస్వాదిస్తుంది.. అలాగే తన టూర్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా అద్దంలో అందాలు చూసుకుంటూ పాయల్ రాజ్ పుత్ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.