NTV Telugu Site icon

Pawan Kalyan: అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయం

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37,421 చ.కి.మీ. సుసంపన్నమైన అటవీ సంపద ఉందని.. శ్రీగంధం, ఎర్ర చందనం లాంటివి విలువైన వృక్ష జాతులు… అద్భుతమయిన వన్య ప్రాణులు మన అడవుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. అమూల్యమైన ఈ సహజ సంపదను అవిశ్రాంతంగా పరిరక్షించడంలో అంకిత భావంతో కూడిన మన రాష్ట్ర అటవీ సిబ్బంది ముందంజలో ఉన్నారని అన్నారు.

Read Also: Minister Kollu Ravindra: అక్టోబర్‌ నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం

ఈ వనరులను కాపాడుకునే క్రమంలో, మా ధైర్యవంతులైన సిబ్బందిలో కొందరు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన చారిత్రాత్మక త్యాగాన్ని స్మరించుకొంటూ సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. మన అటవీ వనరుల రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ శాఖ సిబ్బందికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. వారి త్యాగాలు స్మరణీయమైనవన్నారు. మన అడవులను, వన్యప్రాణులను భవిష్యత్ తరాలకు సంరక్షించే కీలకమైన కర్తవ్యాన్ని కొనసాగించడానికి వారి ధైర్యం, నిబద్ధత మనందరికీ ఎల్లప్పుడూ ప్రేరణగా ఉపయోగపడుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Show comments