NTV Telugu Site icon

Pawan Kalyan: తన క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పవన్..పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై ఆరా

New Project (1)

New Project (1)

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తన క్యాంప్ ఆఫీసులో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ వ్యవహరాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఈనెల 19న పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముంద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించారు.

READ MORE: Rahul Gandhi: రాహల్ గాంధీకి ఖర్గే బెదిరింపులు.. ఎందుకో తెలుసా..?

అనంతరం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ అయ్యారు. తొలిసారి తన ఛాంబరుకు వచ్చిన పవన్ కల్యాణ్ని సీటులోంటి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు..ముఖ్యమంత్రి చంద్రబాబు. సీఎం ఛాంబర్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి.. మీరు ఆ గుర్తుకు హూందాతనం తెచ్చారని పవన్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. తాజా రాజకీయాలు, అసెంబ్లీ సమావేశాలుపై చంద్రబాబు-పవన్ మధ్య చర్చ జరిగింది. చంద్రబాబు పోలవరం పర్యటన, ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులపై చర్చ జరిపారు. సచివాలయం చేరుకున్న అనంతరం నేరుగా సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.