Site icon NTV Telugu

Pawan Kalyan: తండ్రీ తనయులు.. పవన్‌, అకీరా, శంకర్‌ పిక్ వైరల్‌!

Pawan Kalyan's Sons

Pawan Kalyan's Sons

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన ఇద్దరు కుమారులతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. పెద్ద కుమారుడు అకీరా నందన్‌, చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌లతో కలిసి పవన్‌ ఈరోజు ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మంగళగిరికి చేరుకోగా.. పవన్ వెంట ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురి ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఫాన్స్ ఈ ఫొటోకు ‘తండ్రీ తనయులు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Abbaya Chowdary: రానున్న రోజుల్లో ‘అబ్బయ్య చౌదరి 2.0’ చూపిస్తా!

మంగళగిరిలో అధికారులు, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై పవన్ కళ్యాణ్ చర్చించారు. అనంతరం మార్కాపురం పర్యటనకు వెళ్లారు. పశ్చిమ ప్రకాశ ప్రాంతానికి తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా రూ.1290 కోట్లతో పనులు జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 శాతం వాటాతో జల జీవన్ మిషన్కు నిధులు ఇవ్వనున్నాయి. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సభ ప్రాంగణంలో స్టేజిపై చిత్రపటానికి పవన్ నివాళి అర్పించారు.

Exit mobile version